Singer Mangli Injured: తీవ్ర గాయాల పాలైన సింగర్ మంగ్లీ

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత పాపులర్ సింగర్ గా మారారు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి. అనంతపురం జిల్లా, గుత్తి మండలం బసినే పల్లిలో పేద బంజార కుటుంబంలో మంగ్లీ జన్మించారు.

Written By: Chai Muchhata, Updated On : June 26, 2023 2:35 pm

Singer Mangli Injured

Follow us on

Singer Mangli Injured: ప్రముఖ సింగర్ మంగ్లీ గాయపడ్డారు. ఆషాయ మాసం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న బోనాల వేడుకలో పాల్గొన్న ఆమె జారిపడి కిందపడ్డారు.దీంతో ఆమెను అక్కడున్నవాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మంగ్లీకి పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు. అయితే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బోనాల సందర్భంగా ఓ సాంగ్ షూటింగ్ లో మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అకస్మాత్తుగా గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు పరామర్శిస్తున్నారు. మంగ్లీ ఎప్పటిలాగే యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు.

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత పాపులర్ సింగర్ గా మారారు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి. అనంతపురం జిల్లా, గుత్తి మండలం బసినే పల్లిలో పేద బంజార కుటుంబంలో మంగ్లీ జన్మించారు. చిన్నప్పటి నుంచే పాటలు పాడడం సత్యవతికి అలవాటు. బాల్యమంతా సొంతగ్రామంలోనే గడిపింది. ఈ క్రమంలో ఆమె ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ సహాయంతో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఆ తరువాత హైదరాబాద్ కు మకాం మార్చిన తరువాత జానపద గీతాలు పాడడం మొదలుపెట్టింది.

తొలుత ఓ న్యూస్ చానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత పాపులర్ అయిన తరువాత ప్రైవేట్ ఆల్బమ్ లో సాంగ్స్ పాడడం మొదలుపెట్టారు. ఆమె సింగ్ చేసినసాంగ్స్ హిట్టు కావడంతో అదే తరహాలో పలు అల్బమ్ లు సొంతంగా చేసింది. మిగతా యాక్టర్లను పెట్టి చాలా అల్బమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి.

అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురం’లో ‘రాములో రాములో’ లో మంగ్లీ వాయిస్ వినిపిస్తుంది.ఇక ఈహె చేసిన సేవలకు 2020లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ జానపద కళాకారిణిగా పురస్కారం అందించింది. అలాగే ఏపీ ప్రభుత్వం ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన ఎస్వీబీసీ సలహాదారురాలిగా నియమించింది. సింగర్ గానే కాకుండా ఉల్లాలా..ఉల్లాల, మాస్ట్రో అనే సినిమాల్లో నటించింది.