https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: దామిని ఎలిమినేషన్ తో చెత్త రికార్డు రిపీట్… చరిత్రలో రెండోసారి ఇలా!

ఈ సీజన్ కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలయింది . వీరిలో ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ , ఏడుగురు జెంట్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు . వారిలో మొదటి మూడు వారాలు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరం .

Written By: , Updated On : September 25, 2023 / 03:46 PM IST
damini eliminated
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ నుంచి రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేస్తుంది. దేశంలోనే నెంబర్ వన్ షో గా పేరు తెచ్చుకుంది . అందుకే మేకర్స్ ఆలస్యం లేకుండా సీజన్ మీద సీజన్ చేసుకుంటూ పోతున్నారు . ఈసారి కొంచెం కొత్తగా ఉల్టా పుల్టా అంటూ షో ను ప్రారంభించారు . అన్నట్టు గానే ఉల్టా పుల్టా గా సీజన్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది .

ఈ సీజన్ కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలయింది . వీరిలో ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ , ఏడుగురు జెంట్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు . వారిలో మొదటి మూడు వారాలు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరం . ఇలా జరగడం బిగ్ బాస్ చరిత్రలో రెండోసారి . గతంలో ఐదో సీజన్ లో ఇలానే ఫస్ట్ త్రీ వీక్స్ ఆడవారు ఎలిమినేట్ అయ్యారు .

ఈ సీజన్ లో ఫస్ట్ వీక్ కిరణ్ రాధోడ్ ,రెండో వారం షకీలా ,గత ఆదివారం దామిని ఎలిమినేట్ అయ్యారు . సీజన్ ఫైవ్ విషయానికొస్తే మొదటి వారం సరయు రాయ్ ,సెకండ్ వీక్ ఉమా ,థర్డ్ వీక్ లహరి షారీలు బయటకు వెళ్లిపోయారు . ఇది ఒక చెత్త రికార్డు గా నమోదయింది. దీనీతో నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తి రేకిస్తుంది . చూడాలి ఈసారి ఎలిమినేట్ ఎవరు అవుతారు లేడీస్ ఆ లేక మేల్ కాంటెస్టన్స్ అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరుగుతుంది.

ఇక నేడు సోమవారం నామినేషన్స్ డే. హౌస్ లో హీటెక్కనుంది. దామిని ఎలిమినేషన్ తో హౌస్లో 11 మంది మిగిలారు. ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర గెలిచారు. కాబట్టి వీరు ఎలిమినేషన్ లో ఉండరు. మిగిలిన కంటెస్టెంట్స్ నామినేట్ అవుతారు.