Tollywood: తమ పేర్లనే సినిమా పేర్లుగా పెట్టి.. అందులో ఏ హీరో సినిమా హిట్ అయ్యిందో తెలుసా?

ఇక స్టార్ హీరోల సినిమాలకు కూడా టైటిల్స్ అనేవి చాలా అవసరం. మన తెలుగు విషయానికి వస్తే కొన్ని టైటిల్స్ కొందరు హీరోలకే సరిపోతాయి అన్నట్లు ఉంటాయి.

Written By: Shiva, Updated On : September 25, 2023 4:15 pm
Follow us on

Tollywood: సినిమాకు కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంత కంటే ఎక్కువ అని చెప్పాలి. చాలా సందర్భాల్లో సినిమా టైటిల్ ను చూసి ఆడియన్స్ సినిమా జోనర్ ఏమిటో, దాని కథ ఏమీటో ఒక అంచనాకు వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ తో పని లేకుండా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే స్థాయి సినిమా టైటిల్ కి ఉందని చెప్పాలి. అందుకే టైటిల్స్ విషయంలో మూవీ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరం అయితే కేవలం టైటిల్ కోసమే కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు..

ఇక స్టార్ హీరోల సినిమాలకు కూడా టైటిల్స్ అనేవి చాలా అవసరం. మన తెలుగు విషయానికి వస్తే కొన్ని టైటిల్స్ కొందరు హీరోలకే సరిపోతాయి అన్నట్లు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో హీరోలు తమ సొంత పేరునే టైటిల్ గా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులో టాప్ హీరోలు గా చలామణి అవుతున్న నాగార్జున , చిరంజీవి కూడా తమ కెరీర్ లో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారే.

1980 దశకంలో మనవూరి పాండవులు , న్యాయం కావాలి, ఖైదీ వంటి చిత్రాలు విజయం సాధించడంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో చిరంజీవి అగ్ర హీరోగా నిలబడడానికి బలమైన పునాదులు వేసిన సినిమాలు ఈ సమయం లోనే విడుదల అయ్యాయి. ఇక 1985 లో అజయ్ క్రియేషన్స్ లో సి వి రాజేంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. దానికి “చిరంజీవి” అనే టైటిల్ ని పెట్టారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు.

ఇక మరో హీరో అక్కినేని నాగార్జున కూడా తన పేరుతో ఒక సినిమాను విడుదల చేశారు. ఆయన 1986 లో విక్రమ్ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడి మొదటి సినిమా కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత జగపతి ఆర్ట్స్ లో వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 1986 లోనే “కెప్టెన్ నాగార్జున ” అనే సినిమా విడుదల అయ్యింది. ఇందులో కుష్బూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఇలా ఇద్దరు హీరోలు తమ తమ పేర్లతో తీసిన సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి .