https://oktelugu.com/

Dont Donate these things: ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవిని వెళ్లగొట్టి దరిద్రం చుట్టుకుంటుంది..

ఎవరైనా ఇంటికి వచ్చి ఫలాన వస్తువు అడిగితే వద్దనకుండా ఇస్తాం. కానీ జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన ఉన్నవారు మాత్రం కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాలేవని చెబుతారు.

Written By: , Updated On : September 25, 2023 / 04:04 PM IST
Follow us on

Dont Donate these things: ‘పుణ్యం కొద్దీ పురుషులు.. దానం కొద్ది బిడ్డలు..’ అని పెద్దలు కొన్ని సందర్భాల్లో తరుచూ చెబుతూ ఉంటారు. మనిషన్నాక తనకు తోచిన విధంగా డబ్బు, వస్తువు ఎంతో కొంత సాయం చేయాలని అంటారు. నేటి కాలంలో చాలా మంది దాన కర్ణులు పెరిగిపోతున్నారు. రోడ్డుపై ఎవరైనా చిల్లర కావాలని అడిగితే లేదనకుండా ఇస్తున్నారు.సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాలతో కొంత మందిలో మార్పులు వస్తున్నాయి. సాటి మనిషికి సాయం చేయాలన్నఆలోచనతో పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. దానం చేయడం మంచి విషయమే. కానీ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు నష్టాలు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీటిలో ఈ వస్తువులు ఇంట్లో నుంచి ఇస్తే దరిద్రాన్ని కొనుక్కున్నట్లేనని అంటున్నారు. ఇంతకీ ఆ వస్తువులేవో చూద్దాం..

ఎవరైనా ఇంటికి వచ్చి ఫలాన వస్తువు అడిగితే వద్దనకుండా ఇస్తాం. కానీ జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన ఉన్నవారు మాత్రం కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాలేవని చెబుతారు. ఎదుటివారు మనసు నొచ్చుకున్నా పరవాలేదు గానీ.. ఆ వస్తువులను మాత్రం అస్సలు దానం చేయరు. దీంతో వారిపై ఎదుటివారికి ఆ వ్యక్తిపై చెడభిప్రాయం కలుగుతుంది. కానీ అలంటి వారికి నష్టాలు ఉండవు. ఎందుకంటే కొన్ని వస్తువుల్లో లక్ష్మీ దేవత దాగి ఉంటుందట. ఆ వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంట్లోని లక్ష్మీని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుందని అంటుంటారు.

దానం చేయకూడని వస్తువుల్లో మొదటిది చీపురు. ఇల్లు శుభ్రం చేయడానికి చీపురే ప్రధానం. ఇంట్లో ఉన్న చెత్తనంతా చీపురు క్లీన్ చేస్తుంది. చీపురులో లక్ష్మీ దేవత దాగి ఉందంటారు. ఎవరైనా వచ్చి చీపురు ఇవ్వాలని అడిగితే అస్సలు ఇవ్వకూడదట. అంతేకాకుండా ఇంట్లో చీపురును వేరొకరికి ఇవ్వడం ద్వా రా లక్ష్మీదేవి అగ్రహిస్తుందట. అలాగే నూనెను కూడా ఇతరులకు ఇవ్వకూడదు. శనిదేవుడికి తైలంతో అభిషేకం చేస్తారు. ఈ రకమైన నూనెను ఇతరులకు ఇవ్వకూడదు. ఇంట్లో మిగిలిపోయిన నూనెను కూడా ఇతరులకు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.

కొంత మంది తాము దనకర్ణులమని భావిస్తూ ఆయుధాల్లాంటి వస్తువులను దానం చేస్తారు. సూది, కత్తెర, కత్తి వంటివి ఇతరులకు ఇస్తారు. కానీ ఇలా ఇవ్వడం వల్ల ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తీసుకొస్తాయి. అందువల్ల ఇలాంటి వస్తువులను దానం చేయకుండా ఉండడమే మంచిది. కొందరు ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో కొన్ని పాత్రలను దానం చేస్తారు. వీటిలో ప్లాస్టిక్ వస్తువులను అస్సలు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో నష్టాలు చేకూరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.