https://oktelugu.com/

ఆ మహా దర్శకుడికి ఓ గాఢమైన కోరిక !

తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. వారిలో ఎందరో మహానుభావులు.. కేవలం కథతోనే సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టిన దిగ్ధర్శకులలో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అచ్చతెలుగు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సీనియర్ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావుగారిది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన తీసిన అప్పటి సినిమాలను చూసి షాక్ అవుతున్నారంటే దానికి కారణం.. కచ్చితంగా సింగీతం శ్రీనివాసరావు క్రియేటివిటీనే. బాలయ్య ఫ్యాన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : July 17, 2020 / 05:04 PM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. వారిలో ఎందరో మహానుభావులు.. కేవలం కథతోనే సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టిన దిగ్ధర్శకులలో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అచ్చతెలుగు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సీనియర్ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావుగారిది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన తీసిన అప్పటి సినిమాలను చూసి షాక్ అవుతున్నారంటే దానికి కారణం.. కచ్చితంగా సింగీతం శ్రీనివాసరావు క్రియేటివిటీనే.

    బాలయ్య ఫ్యాన్స్ కు ఇది ఇబ్బందే !

    ఆ రోజుల్లో ఆయన తీసిన ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు ఇప్పటికీ గొప్ప వైవిధ్యమైన చిత్రలుగా నిలుస్తున్నాయి. తన అభిరుచి ఇప్పటికీ కొత్తగానే అనిపించేలా ముద్ర వేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన 90 ఏళ్లకి సమీపంలో ఉన్నా.. ఓ గొప్ప సినిమా తీద్దామనే ఆలోచిస్తున్నారంటే, సినిమా పై ఆ మహానుభావుడి ఫ్యాషన్ ను అర్ధం చేసుకోవచ్చు.

    ఛాన్స్ లు కోసం హాట్ నెస్ కే యాంకర్ ఫిక్స్ !

    సింగీతంగారు గత నాలుగు సంవత్సరాలుగా ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. ఈ జనరేషన్ సినిమాల గురించే ఆలోచిస్తూ ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా స్క్రిప్ట్ ని రాసుకున్నారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్నా.. ఆయన తన పద్దతిలో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈ లెజెండరీ దర్శకుడిని నమ్మి నిర్మాతలు ముందుకు రావట్లేదని టాక్. మొదట ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ మరో స్క్రిప్ట్ రాసుకున్నా.. అదీ గత సంవత్సరం నుండి సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు కరోనా.. పాపం మరో సినిమా చేయాలనేది సింగీతం శ్రీనివాసరావుగారి గాఢమైన కోరిక. మరి ఆ మహా దర్శకుడి కోరిక నెరవేరుతుందా..!