ఎట్టకేలకు కరోనాపై కేసీఆర్ సర్కార్ కు జ్ఞానోదయం?

ఎవ్వరు ఏమన్నా… మారలేదు కేసీఆర్.. హైకోర్టు ఆగ్రహించినా.. సామాన్యుడు విమర్శించినా.. మీడియా వేలెత్తి చూపినా.. కరోనాపై పట్టించుకోలేదు.. టెస్టులు చేయమని హైకోర్టు చెప్పినా వినలేదు. హైదరాబాద్ లో పరిస్థితి చేయిదాటినా పెద్ద ఎత్తున టెస్టులు జరపలేదు. కానీ ఏమైందో ఏమో.. మొన్న ఓ ఫైన్ మార్నింగ్ కేసీఆర్ కు జ్ఞానోదయమైనట్టు ఉంది. తెలంగాణలో ఇంతటి అధ్వాన వైద్యసేవలకు నిర్లక్ష్యం వహించిన వైద్యశాఖ స్పెషల్ సెక్రెటరీని అటవీశాఖ సెక్రటరీగా బదిలీచేశారు. వైద్యశాఖ కమిషనర్ అయిన ఐఏఎస్ ను మార్చేశారు. […]

Written By: NARESH, Updated On : July 17, 2020 4:47 pm
Follow us on


ఎవ్వరు ఏమన్నా… మారలేదు కేసీఆర్.. హైకోర్టు ఆగ్రహించినా.. సామాన్యుడు విమర్శించినా.. మీడియా వేలెత్తి చూపినా.. కరోనాపై పట్టించుకోలేదు.. టెస్టులు చేయమని హైకోర్టు చెప్పినా వినలేదు. హైదరాబాద్ లో పరిస్థితి చేయిదాటినా పెద్ద ఎత్తున టెస్టులు జరపలేదు. కానీ ఏమైందో ఏమో.. మొన్న ఓ ఫైన్ మార్నింగ్ కేసీఆర్ కు జ్ఞానోదయమైనట్టు ఉంది.

తెలంగాణలో ఇంతటి అధ్వాన వైద్యసేవలకు నిర్లక్ష్యం వహించిన వైద్యశాఖ స్పెషల్ సెక్రెటరీని అటవీశాఖ సెక్రటరీగా బదిలీచేశారు. వైద్యశాఖ కమిషనర్ అయిన ఐఏఎస్ ను మార్చేశారు. ఐత్త సీనియర్ ఐఏఎస్ బ్యాచ్ ను దించారు. అప్పటి నుంచి తెలంగాణ మారిపోయింది. నిన్నటి నుంచి వైద్య సేవల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది.

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!

అన్నివైపుల నుంచి విమర్శలు రావడం.. ఉస్మానియా ఆస్పత్రిలో మురుగునీరు వరద నీరు పోయి పీపీఈ కిట్స్ కొట్టుకుపోయాక జాతీయ స్థాయిలో వార్త అయ్యింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఉస్మానియాలో పారిస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున విమర్శలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. వెంటనే తెలంగాణలో కరోనాపై పడింది. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కేవలం రోజుకు 3వేలు మాత్రమే చేసే పరీక్షలను తాజాగా 14వేలకు పెంచింది. అంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ చేసింది. రోజుకు పదివేలకు పైగానే టెస్టులు చేస్తోంది.

కరోనా టెస్టులు చేయకపోవడం.. బులిటెన్ లోనూ సరైన వివరాలు చూపకపోవడం.. పెద్ద సంఖ్యలో జనాలు కరోనా టెస్టుల కోసం హైదరాబాద్ లో క్యూలు కడుతుండడంతో ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ గేర్ మార్చింది. తెలంగాణ వైద్యశాఖను ప్రక్షాళన చేసిన కేసీఆర్ సర్కార్.. ఇక కొత్త అధికారులను నియమించి వైద్యవ్యవస్థలోనూ వేగాన్ని పెంచారు. పెద్ద ఎత్తున టెస్టులను చేస్తున్నారు.

రాజధానిలో కుప్పలు తెప్పలుగా టు-లెట్లు!

ఇన్నాళ్లు కేవలం జిల్లాలను బట్టి కేసులు పేర్కొనే తెలంగాణ హెల్త్ బులిటెన్ రూపురేఖలు పూర్తిగా మార్చేసింది. వార్డులు.. గల్లీల్లో కూడా ఎక్కడ ఎన్ని ఉన్నాయనే దానిపై పారదర్శకంగా వివరాలు బులిటెన్ లో పేర్కొంటోంది. హైకోర్టు చెప్పినట్టు ఏ వార్డులో ఎంతమందికి కరోనా సోకింది? ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి..? సమగ్ర వివరాలతో బులిటెన్ రిలీజ్ చేస్తోంది. నిన్నటి నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో కరోనా కేంద్ర ఆస్పత్రి గాంధీలో అందుబాటులో ఉన్న బెడ్స్ తోపాటు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా టెస్ట్ సెంటర్స్ ఇలా అన్ని వివరాలను బులిటెన్ లో పొందుపరుస్తోంది.

ఇలా చుట్టుముడుతున్న కరోనా వైఫల్య విమర్శలతో కేసీఆర్ సర్కార్ పూర్తిగా ప్రక్షాళన చేసినట్టు అర్థమవుతోంది.. నిన్నటి తాజా బులిటెన్ చూసినట్టైతే.. ఏకంగా నిన్న ఒక్కరోజే 14వేల టెస్టులకు పైగా చేయడం గమనార్హం. నిన్న 1676 పాజిటివ్ కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 41వేలకు చేరింది. మొత్తానికి కరోనా విషయంలో కాస్తంత సీరియస్ గా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లడం ఊరటగా చెప్పవచ్చు.