‘లక్ష్మణుడి’కి ‘సంజీవని’ దొరికేనా?

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ భవితవ్యంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో ఆ పార్టీ బాగానే పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని లక్ష్మణ్ సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని నేతలు చెబుతుంటారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంలో లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారు. కూల్చివేతలపై కేంద్రం జోక్యం.. ఏం జరుగనుంది? తెలంగాణలో […]

Written By: Neelambaram, Updated On : July 17, 2020 5:19 pm
Follow us on


తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ భవితవ్యంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో ఆ పార్టీ బాగానే పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని లక్ష్మణ్ సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని నేతలు చెబుతుంటారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంలో లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారు.

కూల్చివేతలపై కేంద్రం జోక్యం.. ఏం జరుగనుంది?

తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి లక్ష్మణే కొనసాగుతారని ప్రచారం సాగింది. అయితే బీజేపీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడిని నియమించింది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసి గెలుపొందిన బండి సంజయ్ కుమార్ ను బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించింది. నాటి నుంచి సంజయ్ కూడా టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వెళుతున్నారు.

దీంతో లక్ష్మణ్ పరిస్థితి ఏంటనే టాక్ బీజేపీ శ్రేణుల్లో సర్వత్రా విన్పిస్తుంది. ఆ మధ్య లక్ష్మణ్ కు బీజేపీ రాజ్యసభ సీటు కేటాయిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పట్లో రాజ్యసభ సీటు వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన లక్ష్మణ్ కి అధ్యక్ష పదవిగానీ, రాజ్యసభ సీటుగానీ దక్కకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ పార్టీ ప్రకటన అప్పుడేనంటా?

అయితే లక్ష్మణ్ కు బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక పదవీ కట్టబెట్టే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో లక్ష్మణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని నేతలు కోరుతున్నారట. ఈ పదవీ దక్కితే లక్ష్మణ్ జాతీయ, రాష్ట్రస్థాయిలోనూ చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు లెక్కలేసుకుంటున్నారు. మరీ బీజేపీ అధిష్టానం లక్ష్మణుడికి సంజీవని ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!