Kantara 2 : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. వాటిల్లో ‘కాంతారా 2′(Kanthara : The Chapter 1) కూడా ఒకటి. ‘కాంతారా’ చిత్రం పెద్ద సంచలనమైన బ్లాక్ బస్టర్ కాబట్టి, సాధారణంగానే ఆ సినిమాకు ప్రీక్వెల్ అన్నప్పుడు అంచనాలు మొదటి నుండి భారీగానే ఉంటాయి. కానీ వాటిని అందుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్ లో ఈ చిత్రం విజయం సాధించింది అనే చెప్పాలి. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కేవలం 700 కోట్ల మార్కు దగ్గరే ఈ సినిమా ఆగిపోయింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. తెలుగు లో అయితే చాలా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
కానీ హిందీ , కన్నడ భాషల్లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా ఇప్పటికీ డీసెంట్ గానే ఆడుతుంది కానీ, బ్రేక్ ఈవెన్ మార్కు పెద్దది అవ్వడం తో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 31వ తారీఖున ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు, హిందీ,కన్నడ భాషలతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అప్లోడ్ చేయనున్నారు. థియేటర్స్ లో అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోయిన ఈ సినిమా , కచ్చితంగా ఓటీటీ ఆడియన్స్ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే పాపులర్ సినిమా, తక్కువ సమయం లోనే ఓటీటీ లోకి వచ్చేస్తుంది కాబట్టి, ఎక్కువ కాలం ట్రెండింగ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే. చూడని వాళ్ళు మంచి థియేట్రికల్ అనుభూతిని మిస్ అయిన వాళ్ళే అనుకోవాలి. కొన్ని సన్నివేశాలను అంత అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్/హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరోయిన్ రుక్మిణి వాసంత్ విలన్ రోల్ లో కనిపించడం పెద్ద సర్ప్రైజ్. ఆరంభం నుండి హీరో కి జోడీగా రొమాన్స్ చేస్తూ వచ్చే ఈమె, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో ఇచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇంటర్వెల్ ముందు 15 నిమిషాలు, సెకండ్ హాఫ్ ఆరంభం లో మొదటి 30 నిమిషాలు, ఆ తర్వాత క్లైమాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.