https://oktelugu.com/

Rebel star Prabhas : అక్షరాలా 250 రోజులు..వరల్డ్ రికార్డు నెలకొల్పిన రెబల్ స్టార్ ‘ప్రభాస్’..దరిదాపుల్లో హాలీవుడ్ మూవీ కూడా లేదు!

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 09:40 PM IST

    Rebel star Prabhas

    Follow us on

    Rebel star Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా ‘రాధే శ్యామ్’ చిత్రం ఇండియాలోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. సుమారుగా 200 కోట్ల రూపాయిల నష్టం వాటిలింది అట ఈ సినిమాకి. ఇక ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం పరిస్థితి కూడా ఇంతే. కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిలిచి సుమారుగా 150 కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడమే కాకుండా రామాయణం ని వక్రీకరించారు అంటూ, ప్రభాస్ పై, ఆ సినిమా మేకర్స్ పై పెద్ద ఎత్తున నెగటివిటీ నడిచింది.

    దేశవ్యాప్తంగా డైరెక్టర్ ఓం రౌత్, హీరో ప్రభాస్ దిష్టి బొమ్మలు కొన్ని హిందూ సంఘాలు తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ ని చూసి ప్రభాస్ పని ఇక అయిపోయింది, ఆయన సినిమాలు ఇక ఆడవు అంటూ కొంతమంది పేరు మోసిన జ్యోతిష్యులు కూడా నోరు జారారు. అలా నోరు జారిన ప్రతీ ఒక్కరికి ఆరు నెలల గ్యాప్ లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే రేంజ్ కం బ్యాక్ ‘సలార్’ చిత్రం తో ఇచ్చాడు ప్రభాస్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రభాస్ ని ఊర మాస్ యాంగిల్ లో చూపిస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో చెప్పడానికి ఉదాహరణ ‘సలార్’ చిత్రం. ఈ సినిమాకి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో, అంతకు పది రెట్ల రెస్పాన్స్ ఓటీటీ లో దక్కింది.

    నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్ లలో విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చినా, డిస్నీ + హాట్ స్టార్ లో మాత్రం హాలీవుడ్ చిత్రాలకు కూడా దక్కని రెస్పాన్స్ ఈ చిత్రానికి దక్కింది. ఏకంగా 250 రోజుల నుండి ఈ సినిమా హిందీ వెర్షన్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉందట. దీనిని బట్టి హిందీ ఆడియన్స్ కి ఈ సినిమా ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ‘సలార్ 2’ షూటింగ్ కూడా రీసెంట్ గానే మొదలైంది. అసలే హిందీ సీక్వెల్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ‘సలార్ 2’ కి ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇప్పటి నుండే అంచనాలు వేసుకోవచ్చు.