Dhanush: తమిళ హీరోల్లో ఎంతైనా ఒక సహజత్వం ఉంటుంది. వాళ్లకు బిల్డప్ లు నచ్చవు. ధనుష్ విషయానికే వద్దాం. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు. కానీ అలా ఉండడు. పైగా చేసే సినిమాలు కూడా చాలా సింపుల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇక తాను అయితే మరీ సింపుల్ గా ఉంటాడు. ఎక్కడికి వెళ్లినా ఒక్కడే వెళ్తాడు. ముఖ్యంగా చుట్టూ కండలు తిరిగిన బౌన్సర్లు హడావుడి ఉండదు.

అదే మన హీరోల్లో ఏవరేజ్ హీరో బయటకు వచ్చినా చుట్టూ బౌన్సర్లు ఉండాల్సిందే. పైగా మన హీరోలకు జిగేల్ జిగేల్ మనే డ్రెస్ లు లేకపోతే హీరోయిజం ఉన్నట్టు అనిపించదు. కానీ, ధనుష్ కి అలా కాదు. చాలా సాధాసీదా బట్టలు వేసుకుంటాడు. అదే మన హీరోలు కాస్ట్యూమ్స్ కోసమే లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఏది ఏమైనా ధనుష్ అంటే సింప్లిసిటీ.
ధనుష్ అంటే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం ధనుష్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు ధనుష్ ఇప్పటికే బాగా దగ్గర అయ్యాడు. అందుకే, తమిళంతో పాటు తెలుగులో కూడా ధనుష్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తెలుగులో ‘సార్’ అని టైటిల్ ను ఫిక్స్ చేశారు.
Also Read: ఫిల్మ్ ఇండస్ట్రి లో పెద్దరికం అవసర్లేదు అంటున్న హీరో సుమన్… ఇంకా ఏం అన్నారంటే ?
కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. అన్నట్టు జీ.వి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో మిగిలిన నటీనటులు ఎవరు నటిస్తున్నారు అనేది చూడాలి.
ధనుష్ ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే హీరో. మొదట్లో హీరోగా ధనుష్ కి గుర్తింపు రాలేదు. రాకపోయినా తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయ్యాడు. ధనుష్ అసలు పేరు.. ‘వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా’.