Simhadri Re Release Collection: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుందంటే అభిమానులకు పండగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా చేస్తుంటారు. ఈసారి మరింత ఘనంగా జరిపించడానికి చరిత్ర లో ఎన్నడూ మర్చిపోలేని విధంగా ప్లాన్ చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన సింహాద్రి సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసి రీ రిలీజ్ హిస్టరీ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే ప్రయత్నం చేసారు.
ప్రయత్నం అయితే చాలా బలంగానే చేసారు కానీ, ఆల్ టైం రికార్డుని మాత్రం నెలకొల్పలేకపోయారు. ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రమే ఆల్ టైం రికార్డుగా నిలబడింది.ఆ చిత్రం మొదటి రోజు నాలుగు కోట్ల 15 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా, సింహాద్రి చిత్రం కేవలం మూడు కోట్ల 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది.
నెల రోజుల నుండి పబ్లిసిటీ చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెలెబ్రిటీలను పిలిచి, ఇంత ఖర్చు చేసి ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్ గా విడుదల చేస్తే ఖుషి కి కనీసం దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది కానీ, టాలీవుడ్ లో మాత్రం ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.ఇక రెండవ రోజు అయితే సింహాద్రి పరిస్థితి చాలా దారుణంగా మారింది.
ఒక థియేటర్ లో రావాల్సిన గ్రాస్ లు జిల్లాకు రావడాన్ని గమనించిన ట్రేడ్ వర్గాలు నోరెళ్లబెట్టాయి. కొన్ని చోట్ల అయితే ఆడియన్స్ లేక షోస్ ని క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందట.వాళ్ళ లెక్కల ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి కేవలం 10 లక్షల రూపాయిల గ్రాస్ ని మాత్రమే వసూలు చేసిందట.మొత్తం మీద రెండు రోజులకు కలిపి 3 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.