Simbu Song in OG Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సుజిత్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది అనే ప్రకటన వచ్చిన వెంటనే అప్పట్లో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇలా నేటి తరం ఆడియన్స్ ఇష్టపడే జానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకోవడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సినిమా నుండి 2023 వ సంవత్సరం లో విడుదలైన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పిచ్చెక్కిపోయారు. ఇది కదా పవన్ కళ్యాణ్ నుండి కావాల్సిన సినిమా అంటూ కామెంట్స్ చేసారు. దాదాపుగా 70 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల కొంతకాలం ఆగిపోయింది.
అయితే ఇప్పుడు ఆయనకు ఉన్న రాజకీయ కార్యక్రమాల నుండి కాస్త విరామం దొరకడం తో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లో నాలుగైదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడం తో ముంబై షెడ్యూల్ కోసం మూవీ టీం ఈ నెల 24 ముంబై కి వెళ్లనుంది. పవన్ కళ్యాణ్ ఈ నెల 27 న ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘ఫైర్ స్ట్రోమ్’ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తమిళ హీరో శింబు తో పాడించిన సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ కార్యక్రమం పూర్తి అయ్యింది.
Also Read : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో తమిళ హీరో శింబు పెళ్లి ఖరారు..ముహూర్తం ఎప్పుడంటే!
అయితే శింబు(Silambarasan TR) రీసెంట్ గానే కమల్ హాసన్(Kamal Haasan) తో కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ అనే చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ కోసం హైదరాబాద్ కి వచ్చింది మూవీ టీం. శింబు మైక్ అందుకొని మాట్లాడుతున్న సమయం లో ఆడిటోరియం నుండి ఓజీ ఓజీ అంటూ నినాదాలు వచ్చాయి. దానికి శింబు సమాధానం చెప్తూ ‘హా..ఓజీ ఫైర్ స్ట్రోమ్ పాట వచ్చేస్తుంది. థమన్ నాతో అద్భుతమైన పాట ని పాడించాడు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుండో పాట పాడాలి అనేది నా కోరిక. ఎట్టకేలకు ఈ చిత్రం ద్వారా నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చాడు శింబు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వచ్చే నెలలో ఈ పాట ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Its Always a dream to sing for @PawanKalyan garu – Atman @SilambarasanTR_ in #Thuglife eventpic.twitter.com/wHuKn4SwXS
— Pawan – Vijay FC (@VijayPawanFC) May 22, 2025