Sarath Babu: ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌బాబు సోదరుడి తనయుడు ఆయుశ్ హీరోగా పరిచయమవుతోన్న సినిమా దక్ష. ఈ సినిమాలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా, ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ.. దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవడాని అర్థమని.. అతడి మా తల్లాడి సాయికృష్ణ అని నిర్మాతనుద్దేశించి అన్నారు.
మరోవైపు శరత్ బాబు మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలు తట్టుకుని ఇక్కడ వరకు వచ్చిన సాయికృష్ణ.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయుశ్ నాకు కూడా
Also Read: విజయలక్ష్మి శృంగార తారగా ఎలా మారిందంటే ?
కాగా, హీరో ఆయూశ్ మాట్లాడుతూ.. మంచి హీరో అవ్వాలన్నంది నా కల.. ఈ సినిమా అది నెరవేర్చింది అని తెలిపారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.
కాగా, సినిమా కెరీర్ మొదట్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి సేవలందిస్తున్నారు శరత్‌బాబు. కొన్ని వందల సినిమాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఆయుశ్ కూడా ఎదగాలని కోరుకుంటున్నారు.
Also Read: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్ప్రైజ్లు