SIIMA: దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘సైమా’. పూర్తి పేరు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’. ఈ ఏడాది కూడా సైమా ఈ ఘన వేడుకను ఘనంగా నిర్వహించబోతుంది. బెంగళూరు వేదికగా సెప్టెంబర్ 10,11 తేదీల్లో సైమా వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు విభాగాల్లో విజేతల ఎంపిక కోసం నామినేషన్లు వెలువడ్డాయి. ఈ క్రమంలో మ్యూజిక్ కి సంబంధించి కూడా నామినేషన్లు వెలువడ్డాయి.

మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ నామినేషన్ లో ఎవరు ఉన్నారు అంటే..?
‘పుష్ప’ నుంచి దేవి శ్రీ ప్రసాద్ నామినేట్ అయ్యాడు.
‘అఖండ’ సినిమా నుంచి తమన్ నామినేట్ అయ్యాడు.
లవ్‌స్టోరీ సినిమా నుంచి పవన్ నామినేట్ అయ్యాడు.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి గోపీ సుందర్ నామినేట్ అయ్యాడు.
జాతిరత్నాలు నుంచి సంగీత దర్శకుడు రాధన్ నామినేట్ అయ్యాడు. మరి వీరిలో మీకు నచ్చిన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ రూపంలో పెట్టండి.

నిజానికి పై నామినేషన్స్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పడం చాలా ఈజీ. కారణం.. పై చిత్రాల మ్యూజిక్ లో అఖండ అద్భుత విజయాన్ని అందుకుంది. పైగా ఈ సినిమా కోసం తమన్ చాలా కొత్తగా మ్యూజిక్ ను అందించాడు. అందుకే.. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే, సైమా వేడుక పై తమన్ పేరు మరోసారి మారుమ్రోగడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్నట్టు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలకు సంబంధించి కూడా ఈ నామినేషన్లూ రానున్నాయి. అయితే, మీకు నచ్చిన వారికి ఎలా ఓట్లు వేసి గెలిచాలి అనుకుంటున్నారా ? www.siima.in ద్వారా మీకు నచ్చిన సంగీత దర్శకులకు, హీరోలకు, గాయనీగాయకులకు మరియు విలన్ కు ఓట్లు వేసి గెలిపించొచ్చు.