Siddu Jonnalagadda : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda). కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా మన ఆడియన్స్ కి బాగా దగ్గరైన సిద్ధు ఆ తర్వాత మెల్లగా హీరో రోల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ హీరో కెరీర్ ని టిల్లు సిరీస్ ఒక పెద్ద మలుపు తిప్పింది అనే చెప్పాలి. ముఖ్యంగా సిద్దు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కి యూత్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘జాక్'(Jack Movie) చిత్రం ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నేడు మూవీ టీం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, హీరో సిద్ధు, బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu bhaskar) మీడియా తో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ.. శర్వానంద్ తో సమానంగా తీసుకుంటున్నాడుగా!
ముందుగా ఒక రిపోర్టర్ భాస్కర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఒక మంచి డైరెక్టర్, సిద్దు కూడా కేవలం నటుడు మాత్రమే కాదు, అన్ని క్రాఫ్ట్స్ లోనూ బలమైన పట్టు ఉంది. మీ ఇద్దరి మధ్య స్క్రిప్ట్ విషయం లో చర్చలు జరిగినప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడిందా?’ అని అడగ్గా, దానికి భాస్కర్ సమాధానం చెప్తూ ‘కచ్చితంగా క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక రూమ్ లో మేమిద్దరం స్క్రిప్ట్ గురించి చర్చించుకునేటప్పుడు, ఒక పెద్ద వార్ జోన్ లాగా చూసేవాళ్లకు అనిపిస్తుంది. గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదంతా స్క్రిప్ట్ అద్భుతంగా రావడం కోసం మాత్రమే జరిగే చర్చ. రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరిలో సంతృప్తి కరమైన అభిప్రాయం ఉండాలి. అలాంటి అభిప్రాయం వచ్చేవరకు మేము చర్చలు జరిపేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘డైలాగ్స్ విషయం లో నేను సిద్దు కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను. సందర్భం ఇది, డైలాగ్ ఇది, దీనిని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేవాడని. ఇక మొత్తం సిద్దు చూసుకునేవాడు. నేను ఎలాంటి ఔట్పుట్ ని అయితే కోరుకునేవాడినో, ఆ ఔట్పుట్ ని మానిటర్ లో రప్పించేవాడు. సిద్దు తో పని అంటే చాలా తేలికగా అలా అయిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంటే మనం ట్రైలర్ లో చూసిన డైలాగ్స్ మొత్తం సిద్దు రాసినవే అన్నమాట. కాస్త డీజే టిల్లు షేడ్స్ లో ఉన్నట్టుగా అనిపించినప్పటికీ, ఎంజాయ్ చేసే విధంగానే ఉన్నాయి. ఇకపోతే క్రైమ్+ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ తో రూపొందించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.