Mad Square : ఉగాది కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). టాక్ ఆశించిన రేంజ్ లో రాలేదు కానీ, యావరేజ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఆరు రోజుల్లో 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం దాదాపుగా 80 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వచ్చిందని పోస్టర్స్ విడుదల చేశారు. ఈ వీకెండ్ ఈ చిత్రానికి చాలా కీలకం కానుంది. మొదటి నుండి ఈ సినిమాకు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుంది అనే విశ్వాసం ట్రేడ్ లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అతి కష్టం మీద 70 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చేలా ఉంది.
Also Read : రోజురోజుకు పడిపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..6వ రోజు ఎంత వచ్చిందంటే!
ఇకపోతే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. రేపు సాయంత్రం నుండి ఈ ఈవెంట్ జరగబోతుందని, ఎన్టీఆర్(Junior NTR) ముఖ్య అతిథిగా విచ్చేసి తన బామ్మర్ది నార్నే నితిన్(Narne Nithin) సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకుంటాడని తెలుస్తుంది. అయితే ఒకప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ని అభిమానుల సమక్ష్యం లో చేసేవారు. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇలాంటి ఈవెంట్స్ ని హైదరాబాద్ లో జరపడం ఆపేసారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్. అందుకే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీటింగ్ కి కేవలం మూవీ టీం మాత్రమే పాల్గొంటుండట. ఎన్టీఆర్ టీం ని ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు. నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ కి ఎంత క్లోజ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘దేవర’ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయనకు భారీ లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
ఇకపోతే అభిమానులు ఎన్టీఆర్ ని ఒక ఈవెంట్ లో చూసి చాలా రోజులైంది. అంతే కాకుండా ఆయన లేటెస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ చిత్రమ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడని టాక్. రేపు ఈవెంట్ కి వస్తే ఆయన ఏ రేంజ్ లో సన్నబడ్డాడు అనేది అర్థం అవుతుంది. అదే విధంగా రీసెంట్ గానే ఆయన లేటెస్ట్ సూపర్ హిట్ దేవర చిత్రం జపాన్ లో విడుదలై దిగ్విజయంగా నడుస్తుంది.
Also Read : 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ వసూళ్లు..ఎంత వచ్చిందంటే!