Siddu Jonnalagadda
Siddu Jonnalagadda : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda). కెరీర్ ప్రారంభంలో ఈయన చిన్న చిన్న క్యారెక్టర్స్ తోనే నెట్టుకొచ్చాడు. ‘గుంటూరు టాకీస్’ చిత్రం ఈయన మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత కూడా వరుసగా ఆయన క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు. డీజే టిల్లు సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్ కంటే ముందు ఆయన ‘కృష్ణ & హిస్ లీల’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. రానా దగ్గుబాటి(Rana Daggubati) నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ సమయం లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పట్లో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని ఆడియన్స్ తెగ చూసేసారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉండదు కదా. కేవలం కొంత మందికి మాత్రమే ఆ మాధ్యమం ద్వారా రీచ్ అవ్వగలం. అందుకే రానా దగ్గుబాటి ఈ సినిమాని ‘ఇట్స్ కాంప్లికేటెడ్'(I’ts Complicated) పేరుతో వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో విడుదల చేసాడు. విడుదలకు ముందు ఆయన హీరో సిద్దు, హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్(Sradha Srinath) తో కలిసిఅనే ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా కావడంతో కచ్చితంగా థియేటర్స్ లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. విడుదలైన రోజు నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క థియేటర్ లో కూడా కనీస స్థాయిలో ఆక్యుపెన్సీ రాలేదు. ఈ సినిమా విడుదలైన రోజే రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడంతో ఆడియన్స్ ద్రుష్టి మొత్తం ఆ సినిమాపైనే ఉంది.
ఫలితంగా ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు అయినా వస్తుందేమో అని ఆశపడ్డారు కానీ, నాలుగు రోజులకు కలిపి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. అంటే ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చులను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది అన్నమాట. డీజీ టిల్లు సిరీస్ ద్వారా సిద్దు జొన్నలగడ్డ కి వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకోవచ్చని రానా ప్లాన్ వేసాడు, అందుకే కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్టు ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ ని కూడా పెట్టాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇకపోతే సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్(Jack Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఆయన ‘తెలుసు కదా’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కార్యక్రమాలు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. జాక్ టీజర్ రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.