Vallabhaneni Vamsi (3)
Vallabhaneni Vamsi: సోషల్ మీడియాలో( social media) ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. వల్లభనేని వంశీ పై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించనున్నట్లు వైసిపి ట్వీట్ చేసింది. ఈరోజు రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది వైసిపి. అతి పెద్ద రహస్యం బయటపడనుంది అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రాత్రి 7 గంటలకు ఏం జరగబోతుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజుల కిందట గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి సంబంధించి వంశీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని వంశీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.
* జగన్మోహన్ రెడ్డి పరామర్శ
అయితే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi )అరెస్ట్ ప్రజాస్వామికమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సత్య వర్ధన్ అనే వ్యక్తితో బలవంతంగా ఫిర్యాదు చేయించారని.. కానీ ఆయన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని చెబుతోంది వైసిపి. అయితే ఆయనను కిడ్నాప్ చేసి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని.. భయపెట్టారని.. వల్లభనేని వంశీ దీనికి మూల కారకుడు అంటూ ఆరోపిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వంశీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టనని… బట్టలూడదీసి నిలబెడతానని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
* సంచలన అంశంపై ప్రకటన
మరోవైపు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు( evening 7 o’clock ) సంచలన విషయం బయట పెట్టనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే సత్య వర్ధన్ తో కుటుంబ సభ్యులపై దాడి చేసి.. వల్లభనేని వంశీ పై కేసు పెట్టించారని కోణంలో వైసీపీ ఆరోపిస్తోంది. దానిపైనే సోషల్ మీడియాలో ఏదో విషయం వెల్లడించబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అందుకే కూటమి ప్రభుత్వం ప్లాన్ మార్చిందని వైసీపీ అనుమానిస్తోంది.
* ఆ కుటుంబం పై దాడి వీడియో
వాస్తవానికి గన్నవరం టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు, సత్య వర్ధన్( satyavardhan ). ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనతో తెలుగుదేశం పార్టీ బలవంతంగా వంశీ మోహన్ పై ఫిర్యాదు చేయించిందని.. ఆయన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని.. ఈ పరిస్థితుల్లో సత్య వర్ధన్ కుటుంబం పై టిడిపి నేతలు ఒత్తిడి పెంచారని.. సత్య వర్ధన్ ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు ఇప్పించారని వైసీపీ చెప్తోంది. అయితే సత్య వర్ధన్ కుటుంబ సభ్యులపై టిడిపి నేతలు జరిపిన దాడిని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మరి సాయంత్రం ఏడు గంటలకు ఎలాంటి వార్త బ్లాస్ట్ అవుతుందో చూడాలి.
BIG BLAST TODAY AT 7 PM!
The truth behind the Gannavaram case will be exposed. A major cover-up is about to be shattered!#TDPFakeNewsFactory#TruthWillPrevail
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025