https://oktelugu.com/

Siddu Jonnalagadda: నేషనల్ అవార్డు విన్నర్స్ తో సిద్దు జొన్నలగడ్డ.. ఈసారి బాక్స్ ఆఫీస్ విధ్వంసం మామూలుగా ఉండదు!

ఈ చిత్రం సిద్దు ని క్రేజీ గా హీరో గా మార్చింది. ఆ సినిమాలోని ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం అనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఆయన డీజీ టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'టిల్లు స్క్వేర్' లో హీరో గా నటిస్తున్నాడు, ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 28, 2023 / 04:18 PM IST

    Siddu Jonnalagadda

    Follow us on

    Siddu Jonnalagadda: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, అవకాశాల కోసం ఎన్నో కష్టాలుపడి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నేడు, ఆ తర్వాత హీరో గా మారి,ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ. ఈయన గత ఏడాది హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ అనే చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పెట్టిన బడ్జెట్ కి, జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి మూడింతలు ఎక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా అది.

    ఈ చిత్రం సిద్దు ని క్రేజీ గా హీరో గా మార్చింది. ఆ సినిమాలోని ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం అనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఆయన డీజీ టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘టిల్లు స్క్వేర్’ లో హీరో గా నటిస్తున్నాడు, ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

    ఇక పోతే సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గానే ఒక ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నాడు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా మారి సిద్దు జొన్నలగడ్డ తో ఒక సినిమాని తియ్యబోతుంది. ఇది ఒక క్రేజీ లవ్ స్టోరీ అట, ఈ చిత్రానికి జాతీయ అవార్డులను పొందిన ఆరు మంది టెక్నిషియన్స్ పని చేయబోతున్నారట.

    సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్, ఆర్ట్ డైరెక్టర్ గా శర్మిష్ఠ రాయ్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, కొరియోగ్రాఫర్ గా బృంద మాస్టర్ , కాస్ట్యూమ్ డిజైనర్ గా అర్చన రావు, వీళ్ళందరూ కూడా జాతీయ అవార్డు గ్రహీతలు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వాళ్లంతా ఈ సినిమా కోసం పనిచెయ్యబోతున్నారట. ఇది నిజంగా సిద్దు జొన్నలగడ్డ అదృష్టం అనే చెప్పాలి. ఈ చిత్రం తో పాటుగా చిరంజీవి మరియు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా సిద్దు ఒక హీరో గా నటిస్తున్నాడు, ఇలా ఆయన చేతినిండా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.