Pawan Kalyan- Samuthirakani: గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా సాగుతుంది. అయితే దానికి షార్ట్ బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. అందుకే రెండు రోజులు వారాహి యాత్రకు విరామం ప్రకటించారు. ఈ విరామం సమయంలో కూడా ఆయన పని చేయాల్సి వచ్చింది. బ్రో చిత్ర టీజర్ విడుదల ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో దర్శకుడు సముద్రఖని బ్రో టైటిల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
బ్రో చిత్రం జులై 28న విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ జోరు పెంచారు. ముందుగా టీజర్ విడుదల చేయనున్నారు. త్వరలో టీజర్ అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. లుంగీ కట్టులో కూలీగా పవన్ కళ్యాణ్ మాస్ లుక్ షేక్ చేసింది. వింటేజ్ పవన్ గుర్తుకు వచ్చారని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. త్వరలో టీజర్ విడుదల చేయాల్సి ఉంది. దీంతో సముద్రఖని పవన్ కళ్యాణ్ ని కలిశారు. టీజర్ కి అవసరమైన పవన్ కళ్యాణ్ డైలాగ్స్ డబ్బింగ్ చెప్పించారు.
దీనికి సంబంధించిన స్టిల్స్ దర్శకుడు సముద్రఖని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. పుట్టెడు జ్వరంలో కూడా చిత్ర యూనిట్ ఇబ్బంది పడకుండా తన బాధ్యత నెరవేర్చాడు పవన్ కళ్యాణ్. అనారోగ్యంలో కూడా పని చేస్తున్న ఆయన కమిట్మెంట్ ని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. మా హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కింది.
పవన్ కళ్యాణ్ మోడరన్ గాడ్ రోల్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు కథలు మార్పులు చేర్పులు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని తెలుగు వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
OUR #BRO ON FIRE MODE pic.twitter.com/JPQSEordTk
— P.samuthirakani (@thondankani) June 28, 2023