https://oktelugu.com/

Jack Movie Teaser: సోషల్ మీడియాని ఊపేస్తున్న ‘జాక్’ టీజర్..విచిత్రమైన క్యారక్టర్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన సిద్దు జొన్నలగడ్డ!

డీజే టిల్లు సిరీస్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో హీరోగా, పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన కెరీర్ ని నెట్టుకొచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు హీరోగా ఈ స్థాయికి రావడం నిజంగా కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోలకు ఒక ఆదర్శమే అని చెప్పొచ్చు.

Written By: , Updated On : February 7, 2025 / 09:17 PM IST
Follow us on

Jack Movie Teaser: డీజే టిల్లు సిరీస్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో హీరోగా, పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన కెరీర్ ని నెట్టుకొచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు హీరోగా ఈ స్థాయికి రావడం నిజంగా కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోలకు ఒక ఆదర్శమే అని చెప్పొచ్చు. గమ్మత్తు ఏమిటంటే సిద్దు జొన్నలగడ్డ అప్పట్లో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ‘ఆరెంజ్’ చిత్రంలో ఒక చిన్న క్యారక్టర్ ని కనిపించాడు. ఏ క్యారక్టర్ చేశాడో కూడా గుర్తుపట్టలేం. అంతటి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ అన్నమాట అది. అలాంటి బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు సిద్దు ని పెట్టి ‘జాక్’ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆరెంజ్ నుండి జాక్ వరకు సిద్దు జర్నీ ఎలా ఉందో మీరే చూడండి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం.

ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. సిద్దు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే అని ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో హీరో క్యారక్టర్ ఐటీ ఉద్యోగం చేసేవాడిలాగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని, మెడలో ఐడీ కార్డుని తగిలించి చూసేందుకు చాలా క్లాస్ గా కనిపిస్తాడు. కానీ చేసే అసలు ఉద్యోగం, దొంగతనాలు చేయడం. బైక్స్ కొట్టేయడం, పర్సులు దోచేయడం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో లక్షణాలు ఇతనిలో ఉంటాయి. కొడుకు ఇలాంటి పనులు చేయడం చూసి ఫ్రస్ట్రేషన్ తో ఉరి వేసుకోవాలని అనుకుంటాడు. ఈ టీజర్ లో హీరో వాళ్ళ నాన్న నరేష్ తో మాట్లాడుతూ ‘నేను ఏమి అవ్వాలని అనుకుంటున్నానో నువ్వు కలలో కూడా ఊహించలేవు’ అని అంటాడు.

ఈ క్యారక్టర్ ఆర్క్ చూస్తుంటే కిక్ చిత్రం లోని క్యారక్టర్ గుర్తుకు వస్తుంది. టీజర్ ప్రథమార్థం మొత్తం సరదాగా సాగిపోయింది, కానీ మధ్యలో నుండి పోరాట సన్నివేశాలు ఉండడం చూస్తుంటే సినిమాలో కంటెంట్ కూడా చాలా గట్టిగానే పెట్టారని అనిపిస్తుంది. ఏప్రిల్ 11 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ ఆధారపడుంది. ఆయన గత చిత్రం ‘టిల్లు స్క్వేర్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ రేంజ్ ని ‘జాక్’ చిత్రం కూడా అందుకోబోతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ ఏకంగా విజయ్ దేవరకొండ రేంజ్ ని కూడా దాటేయొచ్చు. చూసేందుకు అందంగా ఉంటాడు, కామెడీ టైమింగ్ దగ్గర నుండి అన్ని యాంగిల్స్ లో విజయ్ దేవరకొండ కంటే మంచి నటుడు, చూడాలి మరి ఏ రేంజ్ కి వెళ్లబోతున్నాడు అనేది.

JACK Teaser | Siddhu Jonnalagadda | Vaishnavi Chaitanya | Bommarillu Bhaskar | BVSN Prasad | SVCC