Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా..?, థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లో కూడా ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ ద్వారా కేవలం నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మూవీ లవర్స్ ని అలరించిన అల్లు అర్జున్, ఓటీటీ ద్వారా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ప్రతీ ఒక్కరు డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ కి, అల్లు అర్జున్ అద్భుతమైన నటనకి ముగ్దులై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి సక్సెస్ ని చూసిన తర్వాత కూడా అభిమానుల్లో ఎక్కడో తెలియని అసంతృప్తి నెలకొంది. కారణం ఏంటో మన అందరికీ తెలిసిందే, డిసెంబర్ నెల మొత్తం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చున్నాడు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్ లో ఆ సమయంలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం సరైనది కాదని, మూవీ టీం ప్లాన్ చేసుకున్న సక్సెస్ మీట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దేశం మొత్తం టాలీవుడ్ వైపు మరోసారి చూసి గర్వపడే రేంజ్ హిట్ కొట్టినప్పటికీ, మా హీరో సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయాడని అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అందుకే అభిమానుల సంతోషం కోసం, అల్లు అర్జున్ మరియు మూవీ టీం రేపు చివరి సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ తన కొత్త సినిమా కోసం చాలా వరకు మేక్ ఓవర్ అయ్యాడు. ఆయన గెటప్ కూడా రేపు వైరల్ కానుంది.
అయితే అల్లు అర్జున్ ఈవెంట్స్ లో మాట్లాడే ప్రతీసారీ సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరుగుతుంది. గతం లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయాడు. ఇది సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే కక్ష గట్టి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారు అనే వాదన కూడా గట్టిగా వినిపించింది. అయితే ఇక నుండి తన ప్రసంగాలలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు అని బలంగా నిశ్చయించుకున్న అల్లు అర్జున్, తన కోసం ప్రత్యేకంగా ఒక స్పోక్స్ పర్సన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక నుండి ఆయన ప్రసంగం స్క్రిప్ట్ మొత్తం ఈ స్పోక్స్ పర్సన్ ఇవ్వనున్నాడు. అంటే ఇక నుండి అల్లు అర్జున్ స్పీచ్ లో గొప్ప మార్పులు చూడబోతున్నాం అన్నమాట.