Siddhu Jonnalagadda Supports Producer : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కేవలం రెండు మూడు సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). ఈయన కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ రోల్స్ ద్వారానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరో గా కొన్ని సినిమాలు చేసాడు కానీ, అవి ఆశించిన స్థాయిలో గుర్తింపుని తీసుకొని రాలేదు. అలాంటి సమయంలో ఈ హీరో నుండి విడుదలైన ‘కృష్ణ & హిస్ లీల’ చిత్రం ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈయన నుండి వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ లో సిద్దు కి విపరీతమైన క్రేజ్ ని తీసుకొచ్చింది.
ఈ చిత్రం తర్వాత ఆయన బొమ్మరిల్లు భాస్కర్ తో ‘జాక్'(Jack Movie) అనే చిత్రం చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. సిద్దు జొన్నలగడ్డ పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తన పని తాను చేసుకుకోకుండా దర్శకత్వ విభాగం వేలు పెట్టడం వల్లే ఈ సినిమా ఫలితం తారుమారు అయ్యిందని, అంతే కాకుండా ఒక్క సినిమా పెద్ద హిట్ అయ్యేలోపు రెమ్యూనరేషన్ రెండింతలు పెంచేసి నిర్మాతకు భారం అయ్యాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఇవి దాకా చేరాయో ఏమో తెలియదు కానీ, తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలు నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడని ఇప్పుడు సోషల్ మీడియా లో నడుస్తున్న చర్చ. ఈ చిత్రానికి మొత్తం మీద ఆయన 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అందులో సగం అంటే నాలుగు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చాడు. నిర్మాత క్షేమం గురించి ఆలోచిస్తూ సిద్దూ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఎంతో ఉన్నతమైనదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు.
Also Read : హరీష్ శంకర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే వస్తున్నారా..?
కుర్ర హీరోలందరూ సిద్దు లాగా ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ‘జాక్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. థియేటర్స్ లో వచ్చిన మిశ్రమ స్పందనకు, నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న స్పందనకు అసలు సంబంధమే లేదు. మే8 న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. అంటే దాదాపుగా నెల రోజుల నుండి ట్రెండింగ్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. కేవలం స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలు మాత్రమే ఇప్పట్టి వరకు ఇలాంటి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా కూడా ఆ కోవకు చేరుకోవడం అందరూ గమనించాల్సిన విషయం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఓటీటీ లో ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది.