https://oktelugu.com/

Tillu Square: అందరి రికార్డ్ లు బ్రేక్ చేస్తున్న టిల్లు.. విజయ్ దేవర కొండ రికార్డ్ కొట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే..?

రెండు సంవత్సరాల కిందట సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు "టిల్లు స్క్వేర్" అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 18, 2024 / 02:31 PM IST

    Siddhu Jonnalagadda Tillu Square create records at box office

    Follow us on

    Tillu Square: ప్రస్తుతం సీనియర్ హీరోలు గాని, స్టార్ హీరోలు గాని వాళ్ల హవాను చూపించడం లో కొంతవరకు వెనకబడ్డారు. ఇక గత రెండు నెలల నుంచి చూసుకుంటే ఒక్కటి కూడా పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. ఇక ఈ గ్యాప్ లో రిలీజ్ అయిన చిన్న సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ తమకంటూ మంచి గుర్తింపును కూడా సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి.

    ఇక ఇలాంటి క్రమంలోనే రెండు సంవత్సరాల కిందట సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు “టిల్లు స్క్వేర్” అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని…

    అయితే ఈయన శ్రీకాంత్ ఓదెల అనే ఒక దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ చేసిన “దసర” సినిమా 119 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో సిద్దు ఈ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేశాడు.ఇక ఈ సినిమా ఇప్పటివరకు 125 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా 130 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయాలంటే టిల్లు స్క్వేర్ సినిమా మరొక 6 కోట్లు అదనంగా సంపాదించాల్సి ఉంది.

    ఇక ఇప్పుడు స్కూల్స్, కాలేజీలకు హాలీడేస్ వస్తున్నాయి. కాబట్టి వాళ్లందరూ సినిమాని చూసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆరు కోట్ల కలెక్షన్లు ఈజీగా రాబడుతుందంటూ సినిమా యూనిట్ మొత్తం మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా చేసినట్లయితే విజయ్ దేవరకొండ రికార్డును కూడా సిద్దు జొన్నలగడ్డ బ్రేక్ చేసినవాడు అవుతాడు…