https://oktelugu.com/

శర్వానంద్‌‌కు విలన్‌గా సిద్దార్థ్!

టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తోంది. కుర్రాళ్లతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ జానర్లో చేస్తున్నారు. కథ డిమాండ్‌ చేస్తే ఇతర హీరోల మూవీల్లో చిన్న పాత్రలు, చివరకు ప్రతి నాయక పాత్రలకు కూడా రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో హీరోలు శర్వానంద్‌, సిద్దార్థ ముందుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘ఆర్ఎస్‌ 100’తో అనూహ్య విజయంతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ దర్శకుడు అజయ్‌ భూపతి దీనికి డైరెక్టర్. […]

Written By: , Updated On : June 25, 2020 / 02:26 PM IST
Follow us on


టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తోంది. కుర్రాళ్లతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ జానర్లో చేస్తున్నారు. కథ డిమాండ్‌ చేస్తే ఇతర హీరోల మూవీల్లో చిన్న పాత్రలు, చివరకు ప్రతి నాయక పాత్రలకు కూడా రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో హీరోలు శర్వానంద్‌, సిద్దార్థ ముందుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘ఆర్ఎస్‌ 100’తో అనూహ్య విజయంతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ దర్శకుడు అజయ్‌ భూపతి దీనికి డైరెక్టర్. తన రెండో సినిమాకే అతను ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేశాడు. ‘మహా సముద్రం’ టైటిల్‌తో రూపొందే ఈ మూవీలో అదితీ రావు హైదరి హీరోయిన్. అనిల్‌ సుంకర నిర్మాత.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

తన ఫస్ట్‌ మూవీతోనే సక్సెస్‌తో పాటు వెరైటీ పాత్‌ను ఎంచుకున్న అజయ్ అతని రెండో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. శర్వానంద్, తెలుగులో చాన్నాళ్ల తర్వాత స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్న సిద్దార్థ్‌ ఇందులో ప్రాణ స్నేహితులుగా నటిస్తారట. కానీ, ఓ అమ్మాయి కారణంగా బద్ద శత్రువులుగా మారిపోతారట. ఫస్టాప్‌ ఫ్రెండ్షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్టైన్మెంట్‌గా సాగే మూవీ సెకండాఫ్‌కు వచ్చే సరికి అసలైన క్రైమ్‌ జానర్లోకి వెళ్తుందట. తొలి భాగంలో శర్వాతో స్నేహంగా మెలిగే సిద్దార్థ్‌ రెండో భాగంలో విలన్‌గా మారపోతాడని టాలీవుడ్‌ టాక్‌. బలమైన పాత్ర కావడంతో విలన్‌గా నటించేందుకు సిద్దార్థ్‌ ఒప్పుకున్నాడట. ఈ మేరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్టు సమాచారం. అయితే, దీనిపై డైరెక్టర్ అజయ్‌ భూపతి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వచ్చిన వార్తలు నిజమైతే మాత్రం ఇద్దరు యువ హీరోలు, ఓ యంగ్‌ డైరెక్టర్తో ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం.