Homeఎంటర్టైన్మెంట్Siddu Jonnalagadda- Chiranjeevi: యంగ్ చిరంజీవి గా నటించబోతున్న 'డీజే టిల్లు' హీరో సిద్దార్థ్ జొన్నలగడ్డ

Siddu Jonnalagadda- Chiranjeevi: యంగ్ చిరంజీవి గా నటించబోతున్న ‘డీజే టిల్లు’ హీరో సిద్దార్థ్ జొన్నలగడ్డ

రీమేక్ సినిమాలు చెయ్యకూడదని మెగాస్టార్ చిరంజీవి బలమైన నిర్ణయం తీసుకున్నాడట.ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.

Siddu Jonnalagadda- Chiranjeevi: నిన్న మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి పట్ల చాలా ఆందోళనకరంగా ఉండేవారు. ఎందుకంటే రీ ఎంట్రీ తర్వాత ఆయన వరుసగా రీమేక్ సినిమాలు చెయ్యడమే.ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతున్న రోజుల్లో రీమేక్ సినిమాలను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో అయితే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు హ్రితిక్ రోషన్ లాంటి హీరోల లేటెస్ట్ చిత్రాలు రీమేక్ అవ్వడం వల్ల వసూళ్లు రాబట్టలేక పోయింది.

ఇక కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ ని ఇరగకుమీ స్టార్ స్టేటస్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు రాకపోవడానికి కారణం అది రీమేక్ అవ్వడం వల్లే.త్వరలో విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ ‘భోళా శంకర్’ కూడా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్.ఇలా వరుసగా రీమేక్స్ చేస్తే మెగాస్టార్ మార్కెట్ మొత్తం పోతుందని అభిమానులు భయపడుతూ ఉండేవారు.

అయితే ఇక నుండి రీమేక్ సినిమాలు చెయ్యకూడదని మెగాస్టార్ చిరంజీవి బలమైన నిర్ణయం తీసుకున్నాడట.ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నాడట.పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక యువ కి సరిపడా మంచి పాత్ర ఉందట.ఈ పాత్రకి ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న కళ్యాణ్ కృష్ణ కి చిరంజీవి ‘డీజే టిల్లు’ హీరో సిద్దార్థ్ జొన్నలగడ్డ ని తీసుకోవాల్సిందిగా సూచించాడట.

డీజీ టిల్లు సినిమాతో సిద్దు కి యూత్ లో ఎంత మంచి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పుడు మెగాస్టార్ పక్కన నటిస్తే ఆయన రేంజ్ మరింత పెరగబోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చెయ్యబొయ్యే సినిమా ఇదేనట.చూడాలి ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుందో అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper