Siddharth surgery: మాజీ లవర్ బాయ్ సిద్ధార్థ్ లండన్ లో సర్జరీ చేయించుకున్నాడని.. సిద్ధార్థ్ కి పేస్ సర్జరీ జరిగిందని.. పెరిగిన వయసు రీత్యా మొహం పై వచ్చిన ముడతలను తొలిగించుకోవడానికే సిద్ధార్థ్ ఈ సర్జరీ చేయించుకున్నాడని ఇలా చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. అయితే, ‘మహా సముంద్రం’ సినిమా యాక్షన్ సీక్వెన్స్ చేస్తోన్న సమయంలో సిద్దార్థ్ గాయపడ్డాడు.

ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకడు అజయ్ భూపతి కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా సిద్ధార్థ్ వెన్నుముకకు బాగా గాయమైంది. అందుకే సర్జరీ కోసం లండన్ వెళ్ళాడు సిద్దార్థ్. ఇక ఇండియాకి తిరిగి వచ్చాక, సిద్ధార్థ్ మీడియాకి దూరంగా ఉన్నాడు. కానీ ఫ్యాన్స్ ‘ఏమి జరిగింది’ అంటూ టెన్షన్ పడుతూ కామెంట్స్ చేస్తుండటంతో తాజాగా సిద్దార్థ్ తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చాడు.
ఇన్ స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ఇండియాకు తిరిగి వచ్చాక, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని.. ప్రస్తుతం హైదరాబాద్ కి వచ్చాను అని, ‘మహా సముంద్రం’ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నానని.. సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా ‘మహా సముంద్రం’ సినిమా రిలీజ్ కోసం తాను ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని, తన స్పైన్ సర్జరీ కూడా బాగా జరిగిందని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.
స్పైన్ సర్జరీ విషయంలో సిద్దార్థ్ ను డాక్టర్లు మరికొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారట. కానీ ‘మహా సముంద్రం’ రిలీజ్ దగ్గర పడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ కి వచ్చి డబ్బింగ్ చెబుతున్నాడు. ఇక సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. మరి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోన్న ఈ హీరో ఏ రేంజ్ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
కాగా ‘మహా సముంద్రం’ మూవీ అక్టోబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.