Shyam Singha Roy On OTT: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా నటించిన ఈ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. డిసెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా చక్కగా తెరకెక్కించాడు. అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు.
Also Read: Varun Tej- Allu Arjun: వరుణ్ తేజ్ ‘గని’ బన్నీకి బాగా నచ్చిందట
ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యింది. రిలీజ్ అయిన వారం రోజులకే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఏపిలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్స్ సమస్య ఉంది. పైగా టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ.

ఆ కారణంగా అక్కడ ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. కాకపోతే.. మిగిలిన చోట్ల కలెక్షన్స్ బాగుండటంతో శ్యామ్ బయట పడ్డాడు. ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం నాని ఎంతో కసితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేశాడు. అయితే, సినిమా హిట్ అవ్వడంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరి థియేటర్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.
Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!