KRK On RRR: ఒకపక్క ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, అసలు ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. బాలీవుడ్ విమర్శకుడు కే.ఆర్.బీ (KRK) మాత్రం ఆర్ఆర్ఆర్ పై పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తమ్మీద విమర్శకుడు కే.ఆర్.బీ మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ పై తన అక్కసు వెళ్లగక్కాడు. బాహుబలి, బాహుబలి-2లకు కలిపి పెట్టిన బడ్జెట్ కంటే రెండింతలు పెట్టుబడి ఆర్ఆర్ఆర్ సినిమాకు పెట్టారని, కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తుంటే ఆ మూవీ ఈ దశాబ్దపు డిజాస్టర్ అని అర్థమవుతోందని కే.ఆర్.బీ సిల్లీ కామెంట్స్ చేశాడు.
Also Read: Varun Tej- Allu Arjun: వరుణ్ తేజ్ ‘గని’ బన్నీకి బాగా నచ్చిందట
మొదటి నుంచి ఈ బాలీవుడ్ క్రిటిక్ కే.ఆర్.బీ ఆర్ఆర్ఆర్ తో పాటు డైరెక్టర్ రాజమౌళిపైనా తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు. మరోపక్క ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు షేక్ అయిపోతున్న బాక్సాఫీస్ ను చూసి ట్రేడ్ పండితుల సైతం కలెక్షన్ల ప్రవాహాన్ని అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ బాలీవుడ్, హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మరి ఫస్ట్ వీక్ మొత్తం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా ఫస్ట్ వీక్ గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 391.47 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!