Shweta Tiwari : చాలామంది సినీ తారలు వ్యక్తిగత సమస్యలతో సర్దుకోలేక విడాకుల బాట పడుతున్నారు. తాజాగా మరొక సినీ సెలబ్రిటీ జంట కూడా విడాకుల కోసం కోర్టుమెట్లు ఎక్కిందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్, ఆర్తి జంట విడాకుల కోసం వెయిట్ చేస్తున్నారు. 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ప్రస్తుతం కలిసి ఉండలేము అని చెప్తున్నారు. ఈ జంట తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నారు. గత ఏడాది రవి మోహన్ తమ విడాకుల విషయాన్ని బయట పెట్టారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిచేందుకు ఫ్యామిలీ ఫోటో చాలా ప్రయత్నించింది. వీరిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. కానీ రవి మోహన్ మాత్రం తన భార్యతో విడాకులు కావాల్సిందే అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్తి కూడా కోర్టులో తనకు ప్రతినెలా 40 లక్షల విడాకుల భరణం ఉంచాలని పిటిషన్ పెట్టింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాలలో భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా…
ఇవి పెళ్లి విడాకుల లేదా బిజినెస్ సెటిల్మెంట్ అంటూ కొంతమంది సామాజిక మాధ్యమాలలో సెటైర్లు కూడా వేస్తున్నారు. గతంలో చాహల్ ధన శ్రీ వర్మ విడాకుల సమయంలో కూడా సామాజిక మాధ్యమాలలో ఇలాగే వార్తలు వినిపించాయి. స్టార్ సెలబ్రిటీలపై భరణం విషయంలో సామాజిక మాధ్యమాలలో ఎన్నో విమర్శలు వినిపిస్తాయి. కానీ ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్టార్ హీరోయిన్ మాత్రం రివర్స్ లో తన భర్తకే భరణం ఇచ్చిందట. తన కూతురి కోసం ఈ నటి తన ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటి శ్వేతా తివారి. శ్వేతా తివారి 1998లో రాజా చౌదరిని పెళ్లి చేసుకుంది. కానీ అతని మద్యం అలవాటు అలాగే గృహహింసను తట్టుకోలేక శ్వేత తివారి విడాకులు తీసుకుంది. ఐదేళ్లపాటు వీరిద్దరి మధ్య న్యాయపోరాటం జరిగింది.
చివరకు ఆమె తన భర్తతో సెటిల్మెంట్ లో భాగంగా 93 లక్షల విలువ చేసే ఫ్లాట్ ను భర్తకు భరణంగా ఇచ్చిందట. శ్వేతా తివారి తన కూతురు ఫలక్ తివారి సంరక్షణ కోసం తన ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. శ్వేతాతి వారి మాట్లాడుతున్న జీవితంలో నా కూతురు పలక్ తివారి కంటే నాకు గొప్పది ఏదీ లేదు, నేను సంపాదించిన మొత్తం నా కూతురి కోసమే. ఒక తల్లిగా నేను ఆమెకు బంగారు భవిష్యత్తును అందించడమే నా ముఖ్య లక్ష్యం అని తెలిపింది. శ్వేతా తివారి చెప్పిన ఈ మాటలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండడంతో ఆమెను అభిమానులు ప్రశంసిస్తున్నారు.