Shubham Collection: హీరోయిన్ గా సమంత(Samantha Ruth Prabhu) చూసినంత పీక్ రేంజ్ ని నేటి తరం యంగ్ హీరోయిన్స్ పావు శాతం కూడా చూసి ఉండరు. మొదటి సినిమాతోనే ఆమె కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ ని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఆమె ప్రయాణం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఓపెన్ బుక్ అనొచ్చు. అయితే అనారోగ్యం కారణంగా కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ లో ఆమె నిర్మాతగా వ్యవహరిస్తూ, కొత్తవాళ్లతో శుభమ్(Subham Movie) అనే చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రెండు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాం.
విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 2 కోట్ల 80 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి రెండు రోజులకు కలిపి నైజాం ప్రాంతం లో 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ కి కలిపి 45 లక్షలు, మొత్తం మీద రెండు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి మరో 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి కోటి 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, రెండు కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
గ్రౌండ్ లెవెల్ లో పాజిటివ్ టాక్ అద్భుతంగా ఉండడం తో నేడు అన్ని ప్రాంతాల్లో మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కాబట్టి నేటితో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి థియేటర్స్ లో ఎంత వసూళ్లు వచ్చినా సమంత కి బోనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ అన్ని కలిపి 15 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. సమంత కి ఈ సినిమా తియ్యడానికి అయిన ఖర్చు కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా ఉండదు. కాబట్టి ఈ సినిమాతో సమంత పెద్ద జాక్పాట్ కొట్టింది అనే చెప్పాలి. చూడాలి మరి వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం ఏమేరకు వసూళ్లను రాబడుతుంది అనేది.