Homeఎంటర్టైన్మెంట్Shruti Hassan Viral Post: బాగా నీరసించిపోయాను అంటున్న స్టార్ హీరోయిన్

Shruti Hassan Viral Post: బాగా నీరసించిపోయాను అంటున్న స్టార్ హీరోయిన్

Shruti Hassan Viral Post: ఎప్పటికప్పుడు ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో శృతి హాసన్ నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటుంది.అన్నట్టు శృతి హాసన్‌‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి పై శృతి హాసన్ పోస్ట్ పెట్టింది. శ్రుతి తాజాగా ఐసోలేషన్‌లోని తన కష్టాల గురించి చెబుతూ ‘కరోనాతో బాగా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని బాధగా మెసేజ్ చేసింది.

Shruti Haasan
Shruti Haasan

ఆమె మెసేజ్ చూసిన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన శృతీ హాసన్‌.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ ఆమె తెలిపింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడి, కోలుకున్నారు.

Also Read:  టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

ఇక శృతి హాసన్ వేదాంతం కూడా చెబుతుంది. జీవితం చాలా చిన్నది, నచ్చినట్లు బ్రతకడమే తన సిద్ధాంతం అంటుంది ఈ అమ్మడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏ కోశాన ఆమెకు ఉండదు. ఆమె సమాజాన్ని అస్సలు పట్టించుకోదు. నచ్చిన పని పబ్లిక్ గా చేసేస్తూ ఉంటుంది. ఇక కెరీర్ బిగినింగ్ లో అమ్మడుకి సరైన బ్రేక్ రాలేదు. నటించిన చిత్రాలన్నీ పరాజయం కావడంతో ఐరన్ లెగ్ అన్న నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది.

Shruti Haasan
Shruti Haasan

అయితే గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ ఆ తర్వాత పుంజుకున్నారు. శ్రీమంతుడు, రేసు గుర్రం వంటి చిత్రాలు ఆమెకు భారీ విజయాలు కట్టబెట్టాయి. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ప్రేమ పిచ్చిపట్టి లండన్ ప్రియుడితో అక్కడకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం కొత్త ప్రియుడు శాంతను హజారికతో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో శృతి అతనితోనే ఉంటుంది.

Also Read:  ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

  1. […] Radhe Shyam Trailer 2 Review:  ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. తాజాగా ఈ సినిమా ‘ట్రైలర్ 2’ రిలీజ్ అయింది. ‘మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం.. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. […]

  2. […] Salman Khan Sonakshi Sinha Marriage: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారంటే అది ‘సల్మాన్ ఖాన్’ మాత్రమే. ఎందుకంటే 50 ఏళ్లు అయినా కూడా ఇంకా ప్రేమాయణాలు కొనసాగిస్తూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. సల్మాన్ ఖాన్ వివిధ బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ తరచూ ముఖ్యాంశాల్లోకి వెళుతుంటాడు. అయినా బ్యాచ్ లర్ గానే కొనసాగుతున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular