https://oktelugu.com/

Shruti Haasan: శృతి హాసన్ కూడా జాయిన్ అయ్యిందోచ్

Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ చిత్రానికి సంబంధించిన శృతిహాసన్ ఒక లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఆమె ఈ షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చింది శృతిహాసన్. ఇక మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. కాబట్టి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 03:35 PM IST
    Follow us on

    Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ చిత్రానికి సంబంధించిన శృతిహాసన్ ఒక లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఆమె ఈ షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యింది.

    Shruti Haasan

    ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చింది శృతిహాసన్. ఇక మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం అవుతారు. అందులో ఒక హీరోయిన్ పాత్ర చాలా బలమైనదట. అందుకే, ఆ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

    Also Read: Radhe Shaym Closing Collections: రాధే శ్యామ్ క్లోసింగ్ కలెక్షన్లు… నష్టాలలో సరికొత్త రికార్డ్

    ఇక రెండో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. ఇప్పటికే పవర్ స్టార్ సరసన ‘గబ్బర్ సింగ్, కాటమరాయుడు’ చిత్రాల్లో నటించి మెప్పించింది శ్రుతి హాసన్. ఇప్పుడు మెగాస్టార్ సరసన కూడా హీరోయిన్ గా నటిస్తే బాగానే ఉంటుంది. పైగా శృతి హాసన్ సీనియర్ హీరోల సరసన నటించడానికి ఈ మధ్య బాగా అలవాటు పడింది కూడా.

    బాలయ్య సరసన ఆల్ రెడీ ఒక సినిమా చేస్తోంది. రవితేజ పక్కన ఇప్పటికే నటించింది. కన్నడంలో కూడా ఉపేంద్ర తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏది ఏమైనా విశ్వ న‌టుడు ‘క‌మ‌ల్‌ హాస‌న్ కుమార్తె’గానే కాకుండా స్టార్ హీరోయిన్ గా కూడా శ్రుతి హాసన్ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది.

    ఐతే, స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటిత‌నంతోనే ముందుకు పోతుంది. అందుకే, ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు అనుకోండి. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్.

    Shruti Haasan

    అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాం అంటుంటారు ఇప్పటి దర్శకులు. అందుకే జీవితంలో ఎప్పటికైనా చిరుతో ఒక సినిమా అయినా చేయాలని ఇప్పటి దర్శకులందరికీ ఒక బలమైన కోరిక ఉంది. అయితే, అది మెగా డ్రీమ్.. కాబట్టి కోరిక తీరడం కష్టం అనుకునేవాళ్లు ఇన్నాళ్లు. పైగా మీడియం రేంజ్ డైరెక్టర్లకు జీవితంలో ఆ కోరిక తీరదు అని ఇండస్ట్రీలో ఓ నమ్మకం.

    కానీ, కాలం మారుతుంది, చిరు కూడా మారుతున్నారు. అందుకే, నమ్మకాలను పక్కన పెట్టేస్తున్నాడు. చిన్న పెద్ద అని చిరు చూడటం లేదు. మంచి కథతో వస్తే చాలు, అతనికి సినిమా ఇచ్చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు దర్శకులందరికీ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక కలుగుతుంది. ఈ క్రమంలోనే ,మెగాస్టార్ బాబీకి కూడా ఛాన్స్ ఇచ్చాడు.

    Also Read:Prabhas: ప్రభాస్ సీక్రెట్ పిక్ లీక్.. షాక్ లో టీమ్

    Recommended Videos:

    Tags