Shruti Haasan: శృతి హాసన్ బోల్డ్ నెస్ గురించి తెలిసిందే. ఆమెది ఫారిన్ లైఫ్ స్టైల్. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్. దాపరికం అంటూ ఉండదు. తన జీవితం తెరిచిన పుస్తకం. సోషల్ మీడియా వేదికగా తనలోని ప్రతి కోణాన్ని పరిచయం చేస్తుంది. ప్రజెంట్ శృతి హాసన్ సహజీవనం చేస్తున్నారు. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో పాటు ముంబైలో ఓకే ఇంట్లో ఉంటున్నారు. దాదాపు రెండేళ్లుగా వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అలా అని శాంతను తన బాయ్ ఫ్రెండ్ అని శృతి హాసన్ ప్రకటించలేదు. అలాగే ఖండించను కూడా లేదు. ఎన్ని కథనాలు వస్తున్నా జస్ట్ మౌనంగా ఉంటుంది.
కాగా శృతి హాసన్ గోవా వెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నట్లు సమాచారం. షూటింగ్ లో భాగంగా గోవా వెళ్లిన శృతి ఖాళీ సమయంలో మిత్రులతో కలిసి హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఛాటింగ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజెన్స్ శృతి హాసన్ ని డర్టీ క్వచ్చన్స్ అడిగారు. శృతి అసలు సిగ్గుపడకుండా సమాధానం చెప్పింది. ఓ నెటిజెన్… మీరు మీ అండర్ ఆర్మ్ ని స్మెల్ చేస్తూ వీడియో తీసి స్టేటస్ లో పెట్టండి అన్నారు. ఆ అభిమాని వింత కోరికకు షాక్ అయిన శృతి… ‘రియల్లీ’ అని సమాధానం చెప్పింది.
మరొక నెటిజన్… మీరు ఎప్పుడైనా కూర్చొని పిరుదులు పైకి లేపకుండా అపానవాయువు వదిలారా? అని అడిగారు. దానికి శృతి హాసన్ అలా చేశాను అని సమాధానం చెప్పారు. ఇలాంటి డర్టీ క్వచ్చన్స్ ని స్కిప్ చేస్తే సరిపోతుంది. శృతి మాత్రం సమాధానం చెప్పి తాను అందరి లాంటి అమ్మాయి కాదని నిరూపించుకుంది. మరోవైపు శృతి హాసన్ కెరీర్ గాడినపడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఫేడ్ అవుట్ దశలో టాలీవుడ్ ఆమెను అక్కున చేర్చుకుంది.
కమ్ బ్యాక్ తర్వాత శృతి నటించిన క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విజయాలు సాధించాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య, చిరంజీవి చిత్రాల్లో నటించిన శృతి హాసన్ రూ. నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. ఆమె చేతిలో సలార్ వంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ లో సలార్ విడుదల కానుంది.