Bathing Tips: మనం రోజు స్నానం చేస్తాం. ఉదయం పూట అందరు చేస్తారు. కానీ రోజు రెండు పూటలా స్నానం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనకు ఒకసారి చేయడమే గగనం అలాంటిది రెండు సార్లంటే ఎవరు ముందు రారు. దీంతో స్నానం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో స్నానం చేయడం ఒక మంచి ప్రక్రియగానే భావించాలి.
స్నానం చేసిన తరువాత కొన్ని పనులు చేయొద్దు. వీటి వల్ల మనకు నష్టాలు కలుగుతాయి. స్నానం చేసిన తరువాత కొన్ని పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల మన శరీరానికి ఇబ్బందులు రావడం ఖాయం. దీంతో మనకు దుష్ఫలితాలు వస్తాయి. స్నానం విషయంలో కూడా మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి అని తెలుసుకోవాలి.
స్నానం చేసిన తరువాత టవల్ ను గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా తుడవాలి. గట్టిగా రుద్దడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. స్నానం పూర్తయిన తరువాత కొందరు కాస్మోటిక్ పౌడర్ లు రుద్దుతారు. దీంతో వాటిలో ఉండే రసాయనాలతో శరీరం ఇబ్బందులకు గురవుతుంది. ఇలా చేయడం వల్ల శరీరం నిర్జీవంగా మారుతుంది. రసాయన ఉత్పత్తులు కాకుండా సేంద్రియ వస్తువులు వాడటం మంచిది.
మహిళలు స్నానం చేసిన తరువాత వెంట్రుకలను టవల్ తో కొడతారు. అలా చేయడం వల్ల వెంట్రుకల చివర్లు దెబ్బతింటాయి. స్నానం చేసిన వెంటనే దువ్వెనతో జుట్టును దువ్వుతారు. అలా చేయడానికి వీలు లేదు. జుట్టు ఆరిన తరువాతే దువ్వాలి. కొందరు రోజు స్నానం చేయరు. అధిక వేడి ఉన్న నీటిని స్నానానికి వాడకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి.