Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి, ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్ కి తన రేంజ్ ని పెంచుకున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ఈ కన్నడ బ్యూటీ కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు, ‘కాంతారా’ హీరో/డైరెక్టర్ రిషబ్ శెట్టి. మొదటి సినిమానే కన్నడలో భారీ హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అలా వరుస అవకాశాలతో మన టాలీవుడ్ వైపు అడుగుపెట్టిన రష్మిక , ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమ నుండి చాలా కాలం నుండి సోషల్ మీడియా లో తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకుంటుంది.
అందుకు ముఖ్య కారణం ఈమె కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం బ్రేక్ చేసుకోవడం ఒక కారణమైతే, కాంతారా చిత్రం కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సమయంలో ఈమె అభినందనలు చెప్పకుండా మౌనం పాటించడం. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి వల్లే ఈరోజు నువ్వు ఈ స్థానం లో ఉన్నావు. అలాంటిది కాంతారా సినిమా హిట్ అయితే కనీసం పట్టించుకోవా అంటూ సోషల్ మీడియా లో ఆమె పై కన్నడ ఆడియన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ఇన్ స్టాగ్రామ్ కామెంట్స్ లో అప్పట్లో రెచ్చిపోయారు. సోషల్ మీడియా లో తన పై వచ్చిన ఈ నెగిటివిటీ పై రీసెంట్ గా రష్మిక ధామా మూవీ ప్రొమోషన్స్ లో స్పందించింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా కన్నడ సినీ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేయలేదు, లేని పోనీ అపార్థాలు పెట్టుకోవడం వల్లే ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది.
‘కాంతారా’ చిత్రం విజయం పై మీరెందుకు స్పందించలేదు అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానం చెప్తూ ‘ ఏ సినిమా ని అయినా విడుదలైన రెండు మూడు రోజులకే నేను చూడలేను. కానీ చూసినప్పుడు మాత్రం కాంతారా టీం కి శుభాకాంక్షలు తెలియజేశాను. అందుకు ఆ మూవీ టీం కూడా నాకు రెస్పాన్స్ ఇచ్చింది. అన్నీ పబ్లిక్ గా చెయ్యాలని రూల్ ఏమి లేదు. కొన్ని నా వ్యక్తిగతం గా ఉంటాయి. అది తెలియక నా మీద ఇష్టమొచ్చినట్టు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని నేను అసలు పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇకపోతే ఆమె హీరోయిన్ గా ధామ అనే హిందీ లో చిత్రం లో నటించింది. ఈ సినిమా ఈ నెల 21 వ తేదీన విడుదల కాబోతుంది. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక, ఈ సినిమాతో ఆ విజయ పరంపర ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.