Shruti Haasan: హీరోలకు మించిన కష్టం ఒక్కోసారి హీరోయిన్స్ కి ఎదురవుతుంది. ప్రతికూల వాతావరణంలో గ్లామర్ షో చేయడం ఇబ్బంది పెట్టేస్తుంది. రాత్రివేళ వాన పాటల్లో నటించడం పెద్ద సాహసమే. అడవులు, కొండలు, ఎడారులు, మంచు పర్వతాలు వంటి కఠిన పరిస్థితుల్లో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు అనారోగ్యం బారిన కూడా పడొచ్చు. వాతావరణం ఏదైనా హీరోయిన్ అంటే గ్లామర్ గా కనిపించాలి. పరిస్థితులతో సంబంధం లేకుండా అందంగా కనిపించే బట్టలు ధరించాలి. వానలో రైన్ కోట్, చలిలో స్వెట్టర్ వేసుకుంటానంటే కుదరదు. హీరోలకు ఛాయిస్ ఉంటుంది కానీ హీరోయిన్స్ కి ఉండదు.

హీరోయిన్ మాత్రం ఒళ్ళు చూపించాల్సిందే. శృతి హాసన్ వాల్తేరు వీరయ్యలోని ఒక పాట కోసం మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో పని చేశారు. రెండు పాటల చిత్రీకరణకు వాల్తేరు వీరయ్య టీమ్ ఇటీవల ఫ్రాన్స్ వెళ్లారు. ‘శ్రీదేవి చిరంజీవి’ అనే సాంగ్ మోకాళ్ళ లోతు మంచులో షూట్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా మంచుపడుతుంటే ఆ ప్రాంతం శ్వేత వర్ణం అయిపోయింది. ఆ వాతావరణంలో మందపాటి స్వెట్టర్ వేసుకుంటేనే కష్టం. అలాంటిది శ్రుతి జస్ట్ స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ శారీ ధరించి నటించారు.
Also Read: Anchor Anasuya: పూర్తిగా మారిపోయిన అనసూయ… షాక్ అవుతున్న ఫ్యాన్స్
ఆ సమయంలో నాకు చుక్కలు కనిపించాయి. చలి చంపేసింది. మైనస్ డిగ్రీల చలిలో చీర ధరించి డాన్స్ చేయడం అత్యంత కష్టంగా అనిపించిందని శృతి అన్నారు. అయితే అభిమానులు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి సాహసాలు చేయక తప్పదు అన్నారు. ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్ చూస్తే మనకు ఆమె ఎంత కఠిన వాతావరణంలో పని చేశారో అర్థం అవుతుంది. కాగా వాల్తేరు వీరయ్య జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మేకర్స్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దర్శకుడు కే ఎస్ రవీంద్ర వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేశారు. ఆయన విక్రమ్ సాగర్ ఏసీపీగా అలరించనున్నారు. దేవిశ్రీ సంగీతం అందించారు. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఇక సంక్రాంతి బరిలో వారసుడు, వీరసింహారెడ్డి, తెగింపు చిత్రాలతో వాల్తేరు వీరయ్య మూవీ పోటీపడనుంది.
Also Read: Hero Ash Srileela : KGF హీరో యాష్ తో రిలేషన్ షిప్ గురించి శ్రీలీల షాకింగ్ కామెంట్స్
[…] […]