How To be happy in 2023: నూతన సంవత్సరం 2023 వచ్చేసింది. ఎన్నో ఊసులు, ఆశలతో తమ జీవితాలను కొత్త మార్గంలో నడిపించాలని ఎందరో కలలు కంటుంటారు. వారి కలలు సాకారం చేసుకునే క్రమంలో కొన్ని చర్యలు తీసుకుంటే వారి కలలు తీరినట్లే. దీనికి గాను మనం చేయాల్సిందల్లా క్రమశిక్షణతో మనం చేసే పనుల గురించి పట్టించుకోవడం. కొత్త సంవత్సరం వేళ మంచి పనులు చేయాలనే సంకల్పం పెట్టుకుంటే సాధ్యమే. పట్టుదల కూడా తోడు కావాలి. నూతన సంవత్సరంలో మంచి పనులు చేస్తే ఫలితాలు కూడా మంచిగానే వస్తాయి. దీంతో మన కీర్తిప్రతిష్టలు కూడా పెరుగుతాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. దీని కోసం మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు మరి.

సరైన సమయానికి నిద్ర పోవడం కరెక్ట్ టైంకు లేవడం అలవాటుగా చేసుకోండి. దీంతో సుఖమైన నిద్రతో పాటు రోజంతా హుషారుగా ఉండి మన పనులు సక్రమంగా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రోజంతా ఉండే ఉత్సాహంతో మనకు పనులు సాఫీగా సాగుతాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు ముందుకు పోతుంటే మనలో ఉల్లాసం పెరుగుతుంది. తద్వారా పనులు మందకొడిగా కాకుండా వెంటనే జరిగిపోతే ఆ కిక్కే వేరు. అందుకే కొత్త సంవత్సరం వేళ మనం కంటి నిండా నిద్రపోయి పనులు బాగా చేసుకుని మంచి ఫలితాలు సాధించాలి.
రోజంతా ఎలా పని చేసుకోవాలనే దానిమీద ప్రణాళిక ఉండాలి. రోజు మనం చేసుకునే పనులు ఒక ఆర్డర్ ప్రకారం చేసకోవాలి. ముందు కఠినమైన పనులు, తరువాత సులభంగా అయ్యే పనులను రాసుకోవాలి. వాటిని క్రమం తప్పకుండా చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకు సమయం ఆదా అవుతుంది. ఫలితంగా మన పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. దీంతో మనకు పనులు చేయడం తేలికగా మారుతుంది. ఇలా ప్లానింగ్ చేస్తూ పోతుంటే కాలక్రమంలో మనకు పనులు చేసుకునే అలవాటు పెరిగిపోతుంది.

ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమే తినాలి. బయట దొరికే ఫుడ్స్ కు టాటా చెప్పండి. ఇంటి భోజనమే మేలు. బయట తిండ్లు అంత మంచివి కావు. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు రావు. దీంతో మన ఆరోగ్యం కూడా మెరుగుడుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే మన పనులు మనం చేసుకోవచ్చు. ఇక జిమ్ కు వెళ్లి కష్టపడే బదులు మన పెరట్లోనే మొక్కలు పెంచుకుని వాటిని సంరక్షించడం వల్ల మనకు మస్తు వ్యాయామం అవుతుంది. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది.
సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలి. ఏదైనా ఎన్జీవోకు వాలంటీర్ గా ఉంటూ సేవలు చేస్తే మనసు తృప్తిగా ఉంటుంది. మనసు సంతోషంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల మనకు మనమీద నమ్మకం ఏర్పడుతుంది. తాను ఏదైనా చేయగలననే ధీమా వస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మంచినీరు కూడా ఎక్కువగా తాగాలి. అప్పుడే మన ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే కదా మన పనులు మనం చేసుకోగలం. ఇంకా పుస్తకాలు చదవడం కూడా అలవాటు చేసుకోవాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కుటుంబం కోసం కూడా సమయం కేటాయించాలి. విందులు, వినోదాల సమయంలో కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడితే మనపై మంచి ప్రభావం పడుతుంది. లేకపోతే ఏం మనిషిరా అంటూ చీత్కరిస్తారు. ఉరుకుల పరుగుల జీవితంలో బంధువులను బాగా చూసుకోవడం కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. వారు కనిపించనప్పుడు పలకరించాలి. ఆప్యాయంగా మాట్లాడాలి. వారిని మన ఇంటికి ఆహ్వానించాలి. సమయం దొరికినప్పుడు మనం కూడా వారి ఇళ్లకు వెళ్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బంధాలు మరింత బలపడతాయి.
Also Read: Chilli Powder: స్సైసీ కోసం ఎర్రకారం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తన కోపమే తన శత్రువు అన్నట్లు ఇతరులతో మనం మంచిగా ప్రవర్తించాలి. అప్పుడే వారు మనకు విలువ ఇస్తారు. అంతేకాని చీటికి మాటికి కోపంగా ఉంటే ఎవరు దగ్గరకు రారు. మంచి సంగీతం వినడం అలవాటు చేసుకుంటే మనసు కూడా హాయిగా ఉంటుంది. ఫలితంగా మనకు కోపం అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే కొత్త సంవత్సరంలో మనం మంచిగా కాలం గడపొచ్చు.