Homeఎంటర్టైన్మెంట్Shruti Haasan: నా బాయ్ ఫ్రెండ్ లో నాకు నచ్చేది అవే... అమ్మో శృతి ఓపెన్...

Shruti Haasan: నా బాయ్ ఫ్రెండ్ లో నాకు నచ్చేది అవే… అమ్మో శృతి ఓపెన్ గా చెప్పేసింది!

Shruti Haasan: పేరుకు కమల్ హాసన్ కూతురైనా లైఫ్, కెరీర్ విషయంలో ఛాయిస్ శృతి హాసన్ దే. అందుకే శృతి హాసన్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చర్యలు బోల్డ్ గా ఉంటాయి. ఎవరు మాత్రం ఓపెన్ గా ఓ వ్యక్తితో పెళ్లి కాకుండా జీవిస్తున్నానని చెబుతారు. ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ పెరిగిపోతుంది. అయినప్పటికీ పెళ్ళికాని అబ్బాయి అమ్మాయి కలిసి జీవించడం సమాజం తప్పుగానే చూస్తుంది. అందుకే ఇలియానా వివాహం చేసుకోకుండా తల్లి కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఇక శృతి విషయానికి వస్తే ఆమె గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే అనే వ్యక్తిని ప్రేమించారు. అతనితో చట్టపట్టాలేసుకు తిరిగింది. కొన్నిసార్లు చెన్నై తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. అతని కోసం శృతి హాసన్ కెరీర్ కూడా పణంగా పెట్టింది. సినిమాలు వదిలేసి లండన్ లో సెటిల్ అయ్యింది. పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరగ్గా… 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్ళు ప్రియుడి విషయంలో బాధపడ్డ శృతి కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.

టాలీవుడ్ ఆమెను ఆడుకుంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది. అప్పుడే ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికకు దగ్గరైంది. రెండేళ్లుగా పైగా అతడితో సహజీవనం చేస్తుంది. శాంతనుతో శృతి రిలేషన్ బహిరంగ రహస్యమే. అతనితో తన హ్యాపీ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా ఆన్లైన్ చాట్ చేయగా ఫ్యాన్స్ కొన్ని క్రేజీ ప్రశ్నలు అడిగారు. నీ లవర్ లో నీకు నచ్చిన విషయం ఏమిటని అడగ్గా… ఆసక్తికర సమాధానం చెప్పింది.

శాంతను చాలా టాలెంటెడ్. అతడు ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తాడు. శాంతను కళ్లంటే నాకు ఎంతో ఇష్టమని శృతి అన్నారు. ఇక ఎవరు వంట బాగా చేస్తారంటే… నేను అని శృతి చెప్పింది. శాంతను మాత్రం బాగా తింటాడట. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు సారీ చెబుతారంటే… దానికి కూడా నేనే అని శృతి హాసన్ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు చేసిన శృతి సూపర్ హిట్స్ కొట్టింది. సలార్ లో ప్రభాస్ తో జతకట్టగా ఆ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version