Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: 3 నిమిషాల సన్నివేశం కోసం 3 నెలల సమయం.. 'పెద్ది' వాయిదా లో...

Peddi Movie: 3 నిమిషాల సన్నివేశం కోసం 3 నెలల సమయం.. ‘పెద్ది’ వాయిదా లో అసలు కారణం ఇదే.

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) ఈ నెల 30 న విడుదల అవ్వాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత బెటర్ గా ఉండడం కోసం అధిక సమయం కోరుతూ జూన్ నెలకు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. జూన్ 4 న విడుదల అవుతుందా ?, లేదంటే జూన్ 24 న విడుదల అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే , మరో 6 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. నేడు జానీ మాస్టర్ ఆద్వర్యం లో ‘రయ్ రయ్ రారా’ పాటకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేశారు. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఐటెం సాంగ్ చిత్రీకరణ ఒక్కటే బ్యాలన్స్ ఉంది.

రేపటి నుండి వనస్థలిపురం లో ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. నాలుగు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ ఉంటుంది. మొదట్లో ఈ ఐటెం సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని సంప్రదించారు. రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలు తగ్గకపోవడం తో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫేమ్ మానస వారణాసి ని తీసుకుందామని అనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఈరోజు ఉదయం వరకు కూడా ఈ పాటలో సంయుక్త మీనన్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేయబోతుంది అంటూ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, శృతి హాసన్ ఈ ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె కోసం షూటింగ్ మరో రెండు రోజులు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని ఒక సీక్వెన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పహిల్వాన్ టీజర్ ని మేకర్స్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ కి అభిమానుల నుండి మాత్రమే కాదు, ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెన్స్ సినిమాలో 3 నిమిషాల వరకు ఉంటుందట. మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తరుపున రామ్ చరణ్ కుస్తీ ఫైటింగ్ లో కనిపించనున్నాడు. ఆయన రాజస్థాన్ కుస్తీ పోటీదారులతో పోటీ పడబోతున్నాడు అట. ఈ సీక్వెన్స్ మొత్తం అద్భుతంగా వచ్చిందని, థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని , కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసం రిపీట్ గా థియేటర్స్ కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారని అంటున్నారు. ఈ సీక్వెన్స్ లో VFX వర్క్ కూడా చాలా కీలకం అంట. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ డిటైలింగ్ తో ఉండాలని బుచ్చి బాబు పట్టుబట్టడంతో VFX కంపెనీ మూడు నెలల సమయం కోరిందట, ఈ సినిమా వాయిదా పడడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి అని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version