Homeఎంటర్టైన్మెంట్Shruti Haasan opens up : పబ్లిక్ గా తిరిగి, ముద్దాడి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఏమిటి...

Shruti Haasan opens up : పబ్లిక్ గా తిరిగి, ముద్దాడి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఏమిటి ?

Shruti Haasan opens up: ‘శృతి హాసన్’ ( Shruti Haasan) చాల బోల్డ్.. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారిక(Santanu Hazarika)తో పబ్లిక్ గా తిరుగుతూ.. ఆ మధ్య ఒకసారి అతని పెదవులను ముద్దాడుతూ ఫోజులు ఇచ్చి.. ఇప్పుడు మాత్రం అతను బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అసలు ‘శృతి హాసన్’ తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఎన్ని సార్లు వైరల్ కాలేదు. పైగా ఆ బాగోతాల తాలూకు ఫుటేజ్ ను శ్రుతినే […]

Shruti Haasan SantanuShruti Haasan opens up: ‘శృతి హాసన్’ ( Shruti Haasan) చాల బోల్డ్.. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారిక(Santanu Hazarika)తో పబ్లిక్ గా తిరుగుతూ.. ఆ మధ్య ఒకసారి అతని పెదవులను ముద్దాడుతూ ఫోజులు ఇచ్చి.. ఇప్పుడు మాత్రం అతను బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అసలు ‘శృతి హాసన్’ తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఎన్ని సార్లు వైరల్ కాలేదు. పైగా ఆ బాగోతాల తాలూకు ఫుటేజ్ ను శ్రుతినే తరుచూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.

అందుకే, వీరిద్దరి పెళ్లి ఎప్పుడు అంటూ ఓ నెటిజన్ అడిగాడు. ఆ ప్రశ్నకు శ్రుతి హాసన్‌ సమాధానం ఇస్తూ.. ‘నాకు శాంతను బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే. కళలు, సంగీతం పట్ల తనకు అద్భుతమైన అవగాహన ఉంది. అలా మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అందువల్లే ‘శాంతను’తో ఎక్కువగా గడిపడానికి ఇష్టపడతాను. అంతే తప్ప, పెళ్లి గురించి ఆలోచించడం లేదు’ అంటూ శ్రుతి హాసన్‌ సగర్వంగా చెప్పుకొచ్చింది.

మరి పెళ్లి మాటమేమిటి అంటే.. ? శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ ‘అదేంటో నా పెళ్లి పై చాలా మందికి ఆసక్తి ఉంది. అయినా నా పెళ్లి విషయంలో ఎలాంటి సీక్రెట్స్‌ ఉండవు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. కచ్చితంగా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి మీడియాకు చెబుతాను. ప్రస్తుతం అయితే, నాకు పెళ్లి ఆలోచన లేదు’ అని చెప్పింది.

అయితే, నెటిజన్లు మాత్రం శృతి హాసన్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏమిటో శృతి హాసన్ ? పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ మూతి నాకుతూ ఫోజులు ఇచ్చినప్పుడు పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదో ? అని ఒకరు, అయినా దిగజారుడుతనానికి ఇది పరాకాష్టనే అంటూ మరొకరు.. ఇలా నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకటి మాత్రం నిజం. గత కొంతకాలంగా శృతి హాసన్ లో బోల్డ్ నెస్ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయినా శృతి హాసన్ వ్యవహారం మరీ మితిమీరిపోవడానికి ఆమె తెగింపు కూడా ఒక కారణం. ఇలాంటి విషయాల్లో ఆమెను ఎన్నిసార్లు ట్రోలింగ్ చేసినా శృతి హాసన్ మాత్రం తనదైన శైలిలోనే ముందుకు పోతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper