Shruti Haasan: స్టార్ కిడ్ శృతి హాసన్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్. కెరీర్ బిగినింగ్ లోనే చెమటలు పట్టించే టెంప్టింగ్ రోల్స్ చేసిన ఈ భామపై అనేక ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. వీటిలో లండన్ ప్రియుడు మైఖేల్ కోర్స్లే తో అధికారికం. మైఖేల్ తో చాలాకాలం చెట్టపట్టాలేసుకుని తిరిగింది. ఒకటి రెండు సార్లు చెన్నైలోని కమల్ నివాసానికి తీసుకొచ్చి, బంధుమిత్రులకు పరిచయం చేసింది. దీంతో శృతి-మైఖేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనూహ్యంగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. 2019లో మైఖేల్ తమ బ్రేకప్ మ్యాటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కెరీర్ కూడా పక్కనపెట్టి మైఖేల్ కోసం లండన్ వెళ్లిన శృతికి షాక్ తగిలింది. లండన్ నుండి తిరిగొచ్చిన శృతి చిన్న గ్యాప్ ఇచ్చి మరో తోడు వెతుక్కుంది. ప్రస్తుతం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక ప్రేమలో మునిగితేలుతుంది. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. హజారిక తో శృతి రిలేషన్ మొదలై ఏడాది దాటిపోయింది. హజారికను సైతం కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. చెల్లి అక్షర హాసన్ బర్త్ డే పార్టీకి కమల్ హాజరు కాగా, హజారిక కూడా వచ్చారు.
Also Read: AP SSC Results – JanaSena: జగన్ కు ఇది అవమానం.. జనసేనకు కొత్త వరం..
హజారిక ను ప్రేమిస్తున్న శృతి పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్ చేసింది. ఇటీవల ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. తనకు పెళ్లంటే భయమని చెప్పింది. మా పేరెంట్స్ విడిపోయారన్న కారణంగా నేను ఈ అభిప్రాయానికి రాలేదు. తెలియకుండానే పెళ్లి విషయంలో నేను ఆందోళనకు గురవుతున్నానని శృతి చెప్పుకొచ్చింది. ఒకరితో రిలేషన్ లో ఉన్న శృతి పెళ్లి చేసుకోను, నాకు భయమని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

లవ్, రిలేషన్స్ జీవితానికి అనుకూలంగా ఉంటాయి. వాటికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. కాబట్టి నచ్చినంత కాలం కలిసుండి వద్దనుకుంటే విడిపోవచ్చు. పిల్లలు, సంసారం అనే బాధ్యతలు కూడా ఉండవు. పెళ్లి అలా కాదు. విడిపోవాలంటే అనేక లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అందుకే శృతి ఈ అభిప్రాయానికి వచ్చారేమో అనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమెకు హజారికను పెళ్లాడే ఉద్దేశం లేదని తెలుస్తుంది. కాగా కమల్ హాసన్, హీరోయిన్ సారిక ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి పిల్లలే శృతి, అక్షర. ప్రస్తుతం సారిక ముంబైలో ఉంటున్నారు.
Also Read:Naga Chaitanya- Samantha: నాగ చైతన్య కోసం భారీ సినిమాని వదులుకున్న సమంత
[…] Also Read: Shruti Haasan: అమ్మో పెళ్లంటే భయం అంటున్న శృతి… […]
[…] Also Read: Shruti Haasan: అమ్మో పెళ్లంటే భయం అంటున్న శృతి… […]