Shruti Haasan: శ్రుతి హాసన్ ఫుల్ జోష్ లో ఉంది. చేతి నిండా సినిమాలే. వ్యక్తిగత ప్రేమకు ఫుల్ స్టాప్ చెప్పి.. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టింది. బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఫైనల్ చేసిన దగ్గర నుంచి శ్రుతి హాసన్ కు చాన్స్ లు పెరిగాయి. పైగా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు శ్రుతి హాసన్ బాగా ఉత్సాహంగా ఉంది. వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది.
ఇదే క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకి శ్రుతి హాసన్ కు భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అలాగే శ్రుతి హాసన్ మరో వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుందట. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్ లో తెగ కష్టపడిపోతుందని టాక్ నడుస్తోంది. సైలెంట్ గా బాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
Also Read: రామ్ కి అమ్మగా మారబోతున్న ముచ్చర్ల అరుణ
నిజానికి గతంలో శ్రుతి హాసన్ కు కొన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు శ్రుతి హాసన్ హిందీ చిత్రాల పై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాలే నా ప్రధాన టార్గెట్ అంటుంది. ఏది ఏమైనా శ్రుతి హాసన్ కి బాలీవుడ్ లో కొంత క్రేజ్ ఉంది. మొత్తానికి సైడ్ పాత్రలు వచ్చినా శ్రుతి హాసన్ హిందీ సినిమాలను వదులుకునేలా లేదు.
ఎలాగూ బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రస్తుతం దక్షిణాది తారల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ – అట్లీ కలయికలో రూపొందే సినిమాలో కూడా నయనతారనే హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ కోవలోనే శ్రుతి హాసన్ కి కూడా ఛాన్స్ లు బాగా పెరిగాయి. మొత్తమ్మీద శ్రుతి హాసన్ తన ఫుల్ ఫోకస్ సినిమాల పైనే పెట్టింది.
Also Read: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్