https://oktelugu.com/

RRR 18 Days Collections: RRR 18 రోజుల కలెక్షన్లు

RRR 18 Days Collections: RRR మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి సెన్సషనల్ హిట్ తర్వాత దాదాపుగా నాలుగేళ్ల సమయం తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అందరి అంచనాలను దాటి విడుదల అయినా ప్రతి భాషలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..మొదటి రోజు అన్ని భాషలకు కలిపి 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం,అదే ఊపుని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2022 / 03:22 PM IST
    Follow us on

    RRR 18 Days Collections: RRR మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి సెన్సషనల్ హిట్ తర్వాత దాదాపుగా నాలుగేళ్ల సమయం తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అందరి అంచనాలను దాటి విడుదల అయినా ప్రతి భాషలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..మొదటి రోజు అన్ని భాషలకు కలిపి 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం,అదే ఊపుని ఇప్పటి వరుకు కొనసాగిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి మరియు దంగల్ సినిమాలు మినహా ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లో చేరలేదు..కానీ రాజమౌళి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ తో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీసి రెండోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయాడు..ఇక ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    RRR 18 Days Collections

    నైజం ఏరియా లో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కనివిని ఎరుగని రేంజ్ లో దాదాపుగా 75 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసారు..ఈ ప్రాంతం లో #RRR విడుదల రోజు నుండి కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తూనే ఉంది..18 రోజులకు గాను ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 108 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది,ఈ స్థాయి వసూళ్లు ప్రస్తుతం మన స్టార్ హీరోల వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ తో సమానం అని చెప్పవచ్చు..ఇక రాయలసీమ ప్రాంతం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఎలాంటి మాస్ క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే, ఈ ప్రాంతం లో అందరూ ఊహించినట్టే 18 రోజులకు గాను దాదాపుగా 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఉత్తరాంధ్ర ప్రాంతం లో 34 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలో 15 కోట్ల రూపాయిలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కోట్ల రూపాయిల షేర్స్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది.ఇక నెల్లూరు జిల్లాలో 9 కోట్ల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 17 కోట్ల రూపాయిలు మరియు కృష్ణ జిల్లాలో 14 కోట్ల రూపాయిల షేర్స్ ని వసూలు చెయ్యగా మొత్తం మీద 18 రోజులకు గాను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 260 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

    Also Read: RRR 17 Days Collections : కలెక్షన్ల ప్రవాహం ఇంకా ఆగలేదు !

    ఇక హిందీ లో అయితే ఈ సినిమా ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి, 18 రోజులకు గాను అక్కడ ఈ సినిమా 240 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది, కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తర్వాత ఇటీవల కాలం లో ఆ స్థాయి భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే, విడుదల అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోవడం అనేది అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది,ఇక తమిళం లో కూడా ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 తర్వాత ఆ స్థాయి వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు దబ్ సినిమాగా సరికొత్త రికార్డుని నమోదు చేసింది, ఇప్పటి వరుకు ఈ సినిమా అక్కడ దాదాపుగా 37 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టగా , కర్ణాటక లో 42 కోట్ల రూపాయిల షేర్ మరియు కేరళ లో 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది…మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 565 కోట్ల రిపాయిల షేర్ ని రాబట్టి బాహుబలి తర్వాత భారీ వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

    Also Read: RRR Record Breaking: మరో సరికొత్త రికార్డు నమోదు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ !

    Tags