Shruti Haasan Latest Video
Shruti Haasan Latest Video : సౌత్ స్టార్ హీరో కమలాసన్ కూతురు శృతిహాసన్ సైతం హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించి స్టార్ అయ్యారు. కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించి అలరిస్తున్నారు. శృతిహాసన్ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో శృతిని ఓ అగంతకుడు వెంటపడ్డాడు. అసలేం జరిగిందంటే?
సినిమాలు, ఇతర పనుల కారణంగా శృతి హాసన్ ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు. ఆ విషయం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది శృతి. ఇటీవల శృతి హాసన్ పర్సనల్ పనిమీద ముంబై వెళ్లారు. అక్కడ ప్లేయిన్ దిగి తన కారు వద్దకు వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెంబడించాడు. ఆ వ్యక్తి నుంచి శృతి దూరంగా వెళ్తున్నా.. వెంటపడి మరీ ఏదో చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన శృతి ఒక్కసారిగా ఆగి.. నువ్వెవరో నాకు తెలియదు. నా వెంట ఎందుకు వస్తున్నావ్.. అంటూ గట్టిగా వారించింది. అయినా వినకుండా తన వెనుకే వచ్చాడు.
సాధారణంగా లేడీ సెలబ్రేటీలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎయిర్ పోర్టులో శృతికి సెక్యూరిటీ ఎవరూ ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఆమె ఒంటరిగానే నడుచుకుంటూ తన కారు వద్దకు వెళ్తోంది. శృతి వద్దకు ఆ ఆగంతకుడు మాత్రమే కాకుండా మరికొందరు వచ్చి ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో శృతి ఇబ్బంది పడసాగింది.
ప్రస్తుతం శృతి ప్రభాస్ తో కలిసి ‘సాలార్’లో నటిస్తోంది. అంతకుముందు బాలయ్యతో కలిసి ‘వీర సింహారెడ్డి’.. చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించి ఆకట్టుకుంది. ఇటీవల తెలుగు సినిమాలపైపే శృతి ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే శృతిహాసన్ ఎక్కువగా ముంబై ట్రావెల్ చేస్తూ ఉంటుంది. గతంతో తన భాయ్ ప్రెండ్ గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ను షేర్ చేస్తూ ఉండేది.