Shriya Saran: విరామం దొరికితే చాలు వెకేషన్ కి చెక్కేస్తోంది శ్రియా శరన్. నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్న శ్రియ అటు పర్సనల్ లైఫ్ లో, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. తరచుగా ఫ్యామిలీతో విహారాలకు వెళుతుంది శ్రియ. ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా గా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తుంది. సంపాదనలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదనేది ఆమె సిద్ధాంతం. తాజాగా శ్రియ సాగర తీరానికి చెక్కేసింది. ఇక బీచ్ లో అమ్మడు రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంది. శ్రియ వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న శ్రియ కెరీర్ తెలుగులో మొదలైంది తెలుగులోనే. శ్రియ డెబ్యూ మూవీ ఇష్టం 2001లో విడుదలైంది. రెండో సినిమాతోనే హీరో నాగార్జున పక్కన ఛాన్స్ వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంతోషం చిత్రం సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణ పక్కన నటించింది. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన చెన్నకేశవరెడ్డి మంచి విజయం అందుకుంది.
దీంతో టాలీవుడ్ లో స్టార్ గా అవతరించింది. టాప్ స్టార్స్ అందరితో నటించిన శ్రియ… తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి టైర్ టూ హీరోల సరసన కూడా నటించింది. ఠాగూర్, ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళంలో కూడా శ్రియ నటించారు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్-శ్రియ నటించిన శివాజీ భారీ విజయం అందుకుంది. శ్రియ గొప్ప డాన్సర్, అంతకు మించి మంచి నటి. ఆమె అందానికి టాలెంట్ తోడు కావడంతో శ్రియ కెరీర్ సుదీర్ఘంగా సాగింది.
కెరీర్ నెమ్మదించాక శ్రియ వివాహం చేసుకున్నారు. రష్యాకు చెందిన ఆండ్రీతో డేటింగ్ చేసిన శ్రియ 2018లో నిరాడంబరంగా అతన్ని పెళ్లి చేసుకుంది. అనంతరం కూతురిని రహస్యంగా కన్నది. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియ అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె బయటకు చెప్పలేదు. గర్భం దాల్చాక ఆడవాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి. బాడీ షేమింగ్ కి భయపడే తల్లైన విషయం దాచానని శ్రియ వెల్లడించారు.
శ్రియ కూతురు పేరు రాధ. శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ లో ఆమె గెస్ట్ రోల్ చేసింది. ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ కబ్జ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. నాలుగు పదుల వయసులో నాజూకు బాడీ మైంటైన్ చేస్తున్న శ్రియకు ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి…