https://oktelugu.com/

Chiranjeevi Vishwambhara: చిరంజీవి విశ్వంభర సినిమాలో ఐటెం భామ గా మారబోతున్న స్టార్ హీరోయిన్…

Chiranjeevi Vishwambhara: మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఆయన భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ, డాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

Written By: , Updated On : July 10, 2024 / 07:04 PM IST
Shruti Haasan doing an item song in Chiranjeevi Vishwambhara movie

Shruti Haasan doing an item song in Chiranjeevi Vishwambhara movie

Follow us on

Chiranjeevi Vishwambhara: ఒక వ్యక్తి దేన్నైనా బలంగా నమ్మి పూర్తి సామర్థ్యాన్ని దాని మీదే పెట్టీ ఆ పని చేస్తూ ఉంటే ఆ వ్యక్తి అందులో 100% సక్సెస్ అవుతాడని చెప్పడానికి మనం చిరంజీవిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పడని కష్టం లేదు, సక్సెస్ అయ్యాక ఆయన అనుభవించని సుఖం లేదు. ఒకప్పుడు కష్టపడ్డాడు. ఇప్పుడు కూడా అంతకుమించి కష్టపడుతూనే ఎంజాయ్ చేస్తున్నాడు.

అలాగే నాలుగు దశాబ్దాల పాటు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఆయన భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ, డాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో ‘విశ్వంభర ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి సీన్ ని దర్శకుడు ఎలా తీస్తున్నాడు అనేది దగ్గరుండి పరిశీలించి మరి చూసుకుంటున్నాడట.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని కూడా తీసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో ఐటెం భామగా శృతిహాసన్ కనిపించబోతుందనే విషయాలైతే తెలుస్తున్నాయి. నిజానికి శృతిహాసన్ చిరంజీవి గత చిత్రమైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం భామగా మారిపోయింది. శృతిహాసన్ ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా కనిపించింది. మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ ఆగడు ‘ సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో కనిపించి మెప్పించింది.

ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోలతో నటిస్తూనే ఐటెం సాంగ్ లో కూడా మెప్పిస్తుంది. గత సంవత్సరం వచ్చిన ప్రభాస్ ‘సలార్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆవిడ ఇప్పుడు పలు పెద్ద సినిమాలను చేస్తూ చాలా బిజీగా కొనసాగుతుంది. తమిళ్, తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్ ల్లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది…