https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 మీద కోర్టు లో కేసు పెట్టరా.? సినిమా రిలీజ్ అవుతుందా.? లేదా..?

Bharateeyudu 2: ప్రస్తుతం భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా చేసిన భారతీయుడు 2 సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి ఒక భారీ షాక్ తగిలింది.

Written By:
  • Gopi
  • , Updated On : July 10, 2024 / 07:07 PM IST

    Legal Trouble For Bharateeyudu 2 Release

    Follow us on

    Bharateeyudu 2: ఇండియన్ ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించడంలో సిద్ధస్తునిగా పేరు పొందిన ఒకే ఒక నటుడు కమలహాసన్… ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు. నార్మల్ సినిమాల్లో అయితే అతను అస్సలు చేయడు. అందుకు తగ్గట్టుగానే ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి లోకనాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

    ఇక ప్రస్తుతం భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా చేసిన భారతీయుడు 2 సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి ఒక భారీ షాక్ తగిలింది.తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ అనే ఒక వ్యక్తి మర్మ కళ ను కించపరుస్తూ ఈ సినిమాలో చాలా విచ్చలవిడిగా వాడినట్టుగా తెలుసుకొని ఈ సినిమాను రిలీజ్ చేయకూడదు అంటూ కోర్టులో కేసు వేసినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన వివరణను దర్శకుడు శంకర్ కోర్టుకు సబ్మిట్ చేసినప్పటికీ ఇంకా కోర్టు నుంచి ఎలాంటి జడ్జిమెంట్ అయితే రాలేదట.

    మరి ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు గడిస్తే గాని చెప్పలేము. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ విషయాన్ని కోర్టు ఇంకా పెండింగ్ లోనే పెట్టినట్టుగా తెలుస్తుంది. రేపు అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి క్లారిటీ వస్తుందని సినిమా యూనిట్ నుంచి ఒక అభిప్రాయం అయితే వెళ్లడవుతుంది.

    మరి అనుకున్న సమయానికి కనక ఈ సినిమా రాకపోతే మాత్రం సినిమా చాలావరకు నష్టపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టిక్కెట్లను బుక్ చేసుకొని పెట్టుకున్న ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా మరోసారి ఈ సినిమాని చూడడానికి కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా అనుకున్న డేట్ కి ఈ సినిమాను తీసుకురావడానికి డైరెక్టర్ శంకర్ తో పాటు కమలహాసన్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…