Shruti Haasan Controversial Comments: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శృతి హాసన్(Sruthi Haasan). ఈమె ‘గబ్బర్ సింగ్’ చిత్రం చేయడానికి ముందు వరుస గా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని సౌత్ ఇండియా లోనే ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఆమెతో సినిమాలు చేయడానికి భయపడుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో హీరోయిన్ రోల్ ఆఫర్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో శృతి హాసన్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపుగా అందరూ స్టార్ హీరోలు ఆమెతో సినిమాలు చేయడానికి క్యూలు కట్టారు, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కూడా అందుకున్నారు. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆమె ‘కాటమరాయుడు’, ‘వకీల్ సాబ్’ చిత్రాలు చేసింది.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
ఆమె కెరీర్ ఈరోజు ఇలా ఉండడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గురించి శృతి హాసన్ లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియో ని షేర్ చేస్తూ ఆయన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏమి జరిగిందంటే నిన్న హైదరాబాద్ లో ‘కూలీ’ తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న శృతి హాసన్ ని యాంకర్ సుమ పలు ప్రశ్నలు అడిగింది. ఆమె మాట్లాడుతూ ‘మీతో పని చేసిన తెలుగు హీరోల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ హీరోల నుండి మీరు ఏది కోరుకుంటారో చెప్పండి’ అని అడుగుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ సుమ అడగ్గా, దానికి శృతి హాసన్ సమాధానం చెప్తూ ‘ఆయన నుండి ఏది దొంగలించలేము. ఆయన దగ్గర ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఆయనకీ మాత్రమే సూట్ అవుతాయి’ అని అంటుంది.
అప్పుడు యాంకర్ సుమ ‘కానీ నువ్వు కచ్చితంగా ఆయన నుండి ఎదో ఒకటి దొంగలించాలంటే ఏమి దొంగిలిస్తావు’ అని అడుగుతుంది. దానికి శృతి హాసన్ ‘నాకు తెలియడం లేదు’ అని అంటుంది. అప్పుడు సుమ ‘అతని ఎనర్జీ ని దోచుకోవచ్చు కదా’ అని అంటుంది, దానికి శృతి హాసన్ ‘ఇక్కడ ఉన్న నాగార్జున గారిలో కూడా ఎనర్జీ ఉంది.. ఆయన నుండి నాకు ఇక్కడికి డైరెక్ట్ గా ఆ ఎనర్జీ వస్తుంది’ అని అంటుంది. అప్పుడు సుమ ‘పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని దోచుకోవచ్చు కదా’ అని అంటుంది. దానికి శృతి హాసన్ ‘హా..అది ఓకే.. కానీ ఆ చరిష్మా కూడా ఇక్కడ నాగార్జున గారిలో ఉంది. అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాను’ అని అంటుంది శృతి హాసన్. ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
