Shriya Saran: ఓ పదిహేనేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసింది శ్రీయా చరణ్. రెండు జనరేషన్స్ స్టార్స్ ని కవర్ చేసిన ఘనత శ్రీయా సొంతం. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్ లతో జతకట్టింది ఈ బ్యూటీ. కిక్ ఇచ్చే గ్లామర్, కట్టిపడేసే యాక్టింగ్, చూపుతిప్పుకోలేని డాన్స్ శ్రియాను స్టార్ చేశాయి. నాగార్జున హీరోగా విడుదలైన సంతోషం మూవీతో శ్రీయాకు బ్రేక్ వచ్చింది. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, ఛత్రపతి ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. దీంతో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ మొతాన్ని ఊపేసింది. కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో చక్కగా ఎఫైర్ మొదలుపెట్టింది. రష్యాకు చెందిన ఆండ్రీతో చాలా కాలం డేటింగ్ చేసింది. 2018లో శ్రీయా ఎవరికీ తెలియకుండా ఆండ్రీని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత తన పెళ్లి విషయం బయటపెట్టారు. లాక్ డౌన్ సమయంలో శ్రీయా గర్భం దాల్చడం, ఒక ఆడ పిల్లలకు జన్మనివ్వడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని కూడా శ్రీయా రహస్యంగా ఉంచారు. శ్రీయా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.
ఆమె సీనియర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా శ్రీయా నటించారు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలకమైంది. అజయ్ దేవ్ గణ్ భార్యగా ఆమె చేశారు. ప్రస్తుతం దృశ్యం 2 మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా మరోసారి నటిస్తున్నారు. మలయాళ హిట్ రీమేక్ గా తెరకెక్కిన దృశ్యం 2 లో శ్రియా వయసుకొచ్చిన ఇద్దరు అమ్మాయిల తల్లిగా కనిపించనున్నారు. ఈ మూవీ నవంబర్ 17న విడుదల కానుంది.
మరోవైపు శ్రీయా బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా ఆమెను నియమించుకుంటున్నాయి. మోడల్ గా కొన్ని యాడ్స్ లో శ్రీయా నటిస్తున్నారు. తాజాగా ఓ సంస్థ ప్రచార వీడియోలో నటించిన శ్రీయా న్యూడ్ గా స్నానం చేశారు. నూలుపోగు లేకుండా షవర్ క్రింద తడుస్తూ తడి అందాలతో టెంపరేచర్ పెంచేశారు. యాడ్ కోసం న్యూడ్ గా తయారైన శ్రీయా వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఈ బోల్డ్ వీడియో పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.